26.2 C
India
Friday, July 19, 2024
More

  Sammakka Sarakka Jathara : ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీల జాతర ఏర్పాట్లు భేష్ !

  Date:

  Sammakka Sarakka Jathara : కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయాచితవరం లభించింది. ఆసియాలోని అతిపెద్ద జాతరగా చెప్పుకోదగిన ‘సమ్మక్క- సారలమ్మ’ జాతర రెండేళ్లకు ఒకసారి ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈ ఉత్సవం జరుగుతుంది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం జరిగే ఈ ఉత్సవానికి మొక్కులు తీర్చుకోవడానికి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. కోనలో నాలుగు రోజులపాటు జరిగే ఈ ఉత్సవానికి ఈ ఏడాది వచ్చే భక్తుల సంఖ్య కోటి సంఖ్య దాటుతుందని అధికార వర్గాల అంచనా.. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగే ఈ వేడుక ఏర్పాట్లకు ప్రభుత్వాలతో ప్రత్యక్ష ప్రమేయం లేకుండా ఏర్పాట్లు జూలై నెలలోనే ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ వ్యయం 75 కోట్ల రూపాయలు దాటవచ్చు.

  రహదారులు, కరెంట్, సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, మరుగుదొడ్లు, నీటి ఏర్పాట్లు, క్యూలైన్స్, స్నాన ఘట్టాలు, కళ్యాణ కట్టలు, చెక్ డ్యాములు, పోలీసు బందోబస్తు తదితర ఏర్పాట్లలో 21 శాఖలు అహోరాత్రులు కష్టపడుతున్నాయి.

  రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజ నర్సింహ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 50 పడకల తాత్కాలిక హాస్పిటల్ తో పాటు, మేడారంలోని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆరు పడకలతో స్పెషలిస్ట్ డాక్టర్లతో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జాతర పరిసరాల్లో 30, జాతరకు వెళ్లే మార్గంలో 42 వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. 20 మొబైల్ మెడికల్ యూనిట్లు, 15 అంబులెన్సులు, పారామెడికల్ సిబ్బంది 24 గంటలు సిద్ధంగా ఉంటారు. ప్రాథమిక వైద్యం అనంతరం అవసరమైతే మెరుగైన వైద్యం కోసం ములుగు, ఏటూరు, నాగారం, పరకాల ఏరియా ఆసుపత్రులు వరంగల్ ఎంజీఎంలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

  ఈ సమ్మక్క సారక్క వేడుక రెండు విధాలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రాధాన్యత ఉన్నది. ఒకటి పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి పొరపాట్లు భక్తులకు ఇబ్బందులు లేకుండా గతం కంటే ఘనంగా నిర్వహించాలన్నది వారి ఆశయం. రెండవది దాదాపుగా రేవంత్ రెడ్డి క్యాబినెట్ లోని మంత్రులు, జిల్లా స్థాయి నాయకులు తమ మొక్కులు తీర్చుకోవడానికి హాజరు కావడం జరుగుతుంది. అందువల్ల ఏర్పాట్లన్నీ ఎంతో ఘనంగా చేస్తున్నారు.

  Share post:

  More like this
  Related

  Windows : విండోస్  లోసాంకేతిక లోపాలు.. ప్రపంచ వ్యాప్తంగా నిలిచిన సేవలు

  Windows Windows : జూలై 19 ఉదయం నుంచి బ్యాంకులతో సహా మైక్రోసాఫ్ట్...

  Darling Movie : మూవీ రివ్యూ : డార్లింగ్ హిట్టా.. ఫట్టా..?

  డైరెక్షన్ : అశ్విన్ రామ్ నిర్మాత: నిరంజన్ రెడ్డి, చైతన్యరెడ్డి సినిమాటోగ్రఫి: నరేష్ ఎడిటర్: ప్రదీప్...

  Gautam Gambhir : గౌతమ్ గంభీర్ చెప్పినట్లే చేస్తున్నాడా?

  Gautam Gambhir : భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు...

  Heavy Rains : తెలంగాణలో భారీ వర్షాలు.. పది జిల్లాలకు రెడ్ అలర్ట్

  Heavy Rains : తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం, శనివారం భారీ నుంచి...

  POLLS

  [yop_poll id="2"]

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Medaram : 29, 30 తేదీల్లో వనదేవతల దర్శనం నిలిపివేత

  Medaram : మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ...

  Medaram Jatara : మేడారం జాతర చిలకలగుట్టపై సమ్మక్క రహస్యం!!

  Medaram Jatara : మేడారం మహా జాతర సమ్మక్క ఆగమనంతో తారస్థాయికి...

  కొండగట్టు అంజన్న అలయానికి పోటెత్తిన భక్తుులు.

          జగిత్యాల జిల్లా ప్రసిధ్ద పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రానికి భక్తుల తాకిడి...

  Medaram Jatara : మేడారం జాతర ఎప్పుడో తెలుసా?

  Medaram Jatara : తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో సమ్మక్క-సారక్క...