Samsung Galaxy Z Fold 5: శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 మరో ఐదు రోజుల్లో (ఆగస్ట్ 18) ఇండియాలో రిలీజ్ కానుంది. ఫోల్డింగ్ ఫెసిలిటీ కలిగిన ఈ ఫోన్ ఎలా ఉంది.. అందులోని ఫీచర్స్ ఎంటి.. అది తీసుకోవడం వల్లే లాభాలేమైనా ఉన్నాయా? ఇక్కడ తెలుసుకుందాం. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 స్మార్ట్ ఫోన్ 7.6 అంగుళాల స్క్రీన్ ఉంటుంది.
* శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, జెడ్ ఫ్లిప్ 5 స్మార్ట్ ఫోన్ సేల్ ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానుంది.
* గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 కొనడానికి 5 రీజన్స్: కొత్త హింజ్ మెకానిజం, 7.6 అంగుళాల స్క్రీన్, ఫాస్ట్ అండ్ స్మూత్ పెర్ఫార్మెన్స్, మంచి బ్యాటరీ లైఫ్, కూల్ కెమెరా ట్రిక్స్.
* లోపాల గురించి చూస్తే: ఇరుకైన స్క్రీన్కు అలవాటు పడడం, అధిక ధర రూ .1,64,999.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, జెడ్ ఫ్లిప్ 5 తొలి సేల్ ఆగస్టు 18న ప్రారంభం కానుంది. ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి మొదలు ఇది అందించనున్నారు. దీని గురించి ఫర్ఫ్‌క్ట్ గా తెలుసుకుంటే.
కొత్త హింజ్ మెకానిజం
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 బయట గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 మాదిరిగానే కనిపించవచ్చు. కానీ మీరు ఒక చేతిలో ఫోల్డ్ 5, మరో చేతిలో ఫోల్డ్ 4 పట్టుకున్నప్పుడు వ్యత్యాసం కనిపిస్తుంది. 5తో పోలిస్టే 4 తేలికగా ఉంటుంది. 5 బరువు 254 గ్రాములు. ఫోల్డ్ చేస్తే 13.4 మిమీ మందం ఉంటుంది.
ఫోల్డింగ్ విధానం బాగుంది. మొదట్లో, తెరవడం కష్టంగా ఉంటుంది. కొన్న కొత్తలో తెరుస్తుంటే కొంచెం శబ్ధం చేస్తుంది. వాడగా వాడగా మరింత స్మూత్ గా అవుతుంది. ఇందులో 7.6 అంగుళాల భారీ స్క్రీన్ ఉంది. మినీ సినిమా థియేటర్ లాంటిది. అందులో వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం మంచి థ్రిల్ ఇస్తుంది.
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2తో పనిచేస్తుంది, గెలాక్సీ సిరీస్ కోసం రూపొందించబడింది. ఎలాంటి సమస్యలు లేకుండా ఒకేసారి చాలా యాప్స్ వాడవచ్చు. మల్టీ టాస్కింగ్ మాంత్రికుడులా పని చేస్తుంది. యాప్ ల మధ్య మారడం సాఫీగా సాగింది. ఇందులో బ్యాటరీ మరింత సామర్థ్యం కలిగినది. రెండు స్క్రీన్లు పని చేస్తున్నా రోజంతా వస్తుంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జర్ తో జత చేస్తే అత్యంత వేగంగా చార్జ్ అవుతుంది.
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5తో ఫొటోలు మంచి క్లారిటీతో వస్తాయి. ఇందులో విభిన్న కెమెరా లెన్స్ లు ఉన్నాయి. స్పష్టమైన, రంగురంగుల ఫొటోలు తీసుకోవచ్చు. మసక వెలుతురులో కూడా చిత్రాలు బాగున్నాయి. మొదట కవర్ స్క్రీన్ ఉపయోగించడం ప్రారంభించినప్పుడు కొంచెం భిన్నంగా అనిపించింది. సాధారణ ఫోన్లలాగా వెడల్పుగా లేదు, కాబట్టి ఐకాన్లు, కీబోర్డు చిన్నగా, కొంచెం టైట్ గా కనిపిస్తాయి.
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 యొక్క డిస్ల్పే పరిమాణం, ఫీచర్లు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, చౌకగా ఉండదు. జీబీ వేరియంట్ ధర రూ.64,999 ఉంది. ఫోన్లో కొన్ని లోపాలు ఉన్నా ఇంత ధర చాలా ఎక్కువే అనిపిస్తుంది. ఐఫోన్ లాంటి ధర కన్నా తక్కువగా ఉన్నా.. ఆండ్రాయిడ్ వాడే వారికి ఇంత ధర అవసరం లేదనిపించవచ్చు.