Samyuktha Menon : ఇప్పటికి సమాజంలో ఎన్నో అఘాయిత్యాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.. ముఖ్యంగా ఆడవారికి బయటకు వెళితే చాలు ఎప్పుడు ఎలాంటి సమస్యను ఎదుర్కుంటారో అర్ధం కాని పరిస్థితి.. ఆడవారితో అసభ్యంగా ప్రవర్తించడం, వారిని చెడు దృష్టితో చూడడం ఇప్పటికీ ఎన్నో చోట్ల జరుగుతూనే ఉంది.. అయితే కొంత మంది భయపడితే మరి కొంత మంది మాత్రం దైర్యంగా ఎదుర్కుంటారు..
మరి తాజాగా హీరోయిన్ Samyuktha Menon చెప్పిన దాని ప్రకారం ఈమె రెండవ రకానికి చెందినది అని తెలుస్తుంది.. ఈమె జీవితంలో కూడా ఇలాంటి సంఘటన ఎదురవ్వగా ఆమె దైర్యంగా ఎదుర్కొన్నట్టు చెప్పింది. వరుస సినిమాలతో టాలీవుడ్ లో గోల్డెన్ హీరోయిన్ గా మారిపోయిన సంయుక్త తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ తో ఈమె మరోసారి వార్తల్లో నిలిచింది.
ఈమె మాట్లాడుతూ.. ఒకసారి అమ్మతో కలిసి బయటకు వెళ్ళినప్పుడు ఒక ఆకతాయి సిగరెట్ తాగుతూ మా మీదకు పొగ వదిలాడు.. అప్పుడు నేను చూస్తూ ఉండలేక పోయాను.. చూస్తూ ఉంటే వాడు మరింత రెచ్చిపోతాడు.. అందుకే వాడి చెంప చెల్లుమనిపించి ఇంకోసారి ఇలాంటి పనులు చేయొద్దని వాడికి వార్ణింగ్ ఇచ్చాడు..

అమ్మాయిలు ఇలాంటి విషయాల్లో అస్సలు బయటపడ కూడదు. ఇలాంటి సంఘటనలు ఎదురయినప్పుడు వాళ్లతో మనకెందుకులే అని పక్కకు వెళ్ళిపోతారు.. కానీ అలా అమాయకంగా నేను ఉండలేను” అంటూ ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.. ఈమె చెప్పిన ఈ విషయం విని నెటిజెన్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎవ్వరైనా ఇలానే దైర్యంగా ఉండాలని చెప్పుకొస్తున్నారు.