![Sankranthi Ayyappa Pooja](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/01/06-3.jpg)
Sankranthi Ayyappa Pooja : హరిహర పుత్ర అయ్యప్పను కొలిచేందుకు దేశాలు, ప్రాంతాలతో సంబంధం లేదు. అవును కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన వీర మణికంఠుని ఎక్కడ ఉంటూ అయినా పూజించవచ్చు. అమెరికాలో ప్రవాస భారతీయులు అయ్యప్ప మాల ధరించి స్వామి కొలిచారు. మండల దీక్షతో పాటు వారికి వీలైనంత మేరకు 21 రోజులు, 15 రోజుల దీక్షలు తీసుకున్నారు. కార్తీక మాసం ప్రారంభం నుంచి అయ్యప్ప దీక్షలు, మాలా ధారణ మొదలవుతుంది.
అమెరికాలోని శ్రీసాయి దత్త పీఠం కేంద్రంగా శ్రీ శివ విష్ణు దేవాలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతాయి. ఇందులో భాగంగా మాలాధారణ స్వాముల ఆధ్వర్యంలో వైభవంగా పూజలు జరిగాయి. సంక్రాంతి అయ్యప్ప పూజతో పాటు మహా పడి పూజ, మకర జ్యోతి దర్శనం చేసిన స్వాములు తరించి పోయారు. స్వామి కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా నిలుస్తాడని భక్తులు విశ్వసిస్తూ మాలా ధారణ తీసుకున్నారు.
మాలాధారణ విరమణ సమయంలో శ్రీ సాయి దత్త పీఠంలో లేదా సమీపంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఇరుముడి సమర్పించి మొక్కలు చెల్లించుకుంటారు. ఈ వేడుకలను కూడా భక్తుల కోసం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు దత్త పీఠం నిర్వాహకులు. ప్రవాస భారతీయులు వందలాది మంది మాల ధరించి స్వామి వారి పూజలలో రెగ్యులర్ గా పాల్గొంటారు.
శ్రీ శివ విష్ణు దేశాలయంలో మాలా ధారణ స్వాముల కోసం భిక్ష కూడా ఏర్పాటు చేస్తారు. దీని కోసం చాలా మంది భక్తులు సహకరిస్తున్నారు. అమెరికాలో సైతం భారత్ లో లాగానే కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందని దత్త పీఠానికి స్వాములు ధన్యవాదాలు చెప్తుంటారు.
All Images Courtesy by Dr. Shiva Kumar Anand