
Sara Ali Khan Glamor : బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు సంపాదించినంత గుర్తింపు వారి వారసులు సంపాదించు కోలేక పోతున్నారు.. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ డాటర్స్ కూడా ఇండస్ట్రీలోకి అయితే వస్తున్నారు కానీ నిలబడలేక పోతున్నారు.. ఎవరో ఒకరిద్దరు మినహా బాలీవుడ్ స్టార్ డాటర్స్ రాణించిన దాఖలాలు కనిపించడం లేదు..
మరి అలాంటి వారిలో బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ ఒకరు. సైఫ్ అలీ ఖాన్ కూతురిగా బాలీవుడ్ లోకి ఈమె ఎంట్రీ ఇచ్చింది.. ఇప్పటికే ఈమె ‘కేదార్ నాథ్’ తో ఒక విజయం అందుకుంది.. ఆ తర్వాత నటించిన ‘సింబా’ కూడా సూపర్ హిట్ అయ్యింది.. ఇలా ఈ బ్యూటీ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
ఈమె స్టార్ కిడ్ అయినప్పటికీ తన నటనతో క్రేజ్ తెచ్చుకుంది. అలాగే సోషల్ మీడియా వేదికగా అమ్మడు చేసే అందాల విందుకు కూడా ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు.. ఈ స్టార్ డాటర్ దేశీ లుక్ లో అదిరి పోయింది.. డిజైనర్ డ్రెస్ లో ఈ హాట్ బ్యూటీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు..
తాజాగా సారా అలీ ఖాన్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2023 లో రెడ్ కార్పెట్ పై మెరిసింది.. అక్కడ ఈమె చేస్తున్న గ్లామర్ ప్రదర్శన హైలెట్ గా నిలుస్తుంది అనే చెప్పాలి.. తాజాగా మరోసారి ఈమె కేన్స్ లో అందాల జాతర చేస్తుంది.. వైట్ అండ్ బ్లాక్ కాంబోలో డిజైనర్ డ్రెస్ లో మెరిసిన ఈ అందాల భామ లేటెస్ట్ క్లిక్స్ మీరు కూడా చూసేయండి..
View this post on Instagram