
కొద్దిసేపటి క్రితం వెటరన్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు.. ఈయన 71 సంవత్సరాల వయసులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.. దాదాపు 2 నెలలుగా ఈయన అనారోగ్యంగా బాధ పడుతుండగా.. హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందుతూ ప్రాణాలతో పోరాడి ఈ రోజు తుది శ్వాస విడిచారు.
ఆయన శరీరం మొత్తం విషబారినట్టు వైద్యులు తెలిపారు.. కాలేయం, కిడ్నీ, గుండె పని చేయకుండా పడిపోవడంతో ఈయన మరణించినట్టు డాక్టర్స్ చెబుతున్నారు.. ఈయన తన కెరీర్ లో 250 చిత్రాల్లో నటించారు.. సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య, మూడుముళ్ల బంధం, ఆపద్బాంధవుడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు.. ఇక శరత్ బాబు 5 దశాబ్దాలుగా సౌత్ లోని అన్ని భాషలతో పాటు హిందీలో కూడా పలు సినిమాలు చేసి మెప్పించారు.
శరత్ బాబు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక ఈయన చివరి చిత్రం నరేష్ – పవిత్ర లోకేష్ జంటగా నటించిన మళ్ళీ పెళ్లి.. ఈ సినిమాలో ఈయన కృష్ణ పాత్రలో నటించారు.. కాగా ఈయన పర్సనల్ లైఫ్ లో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది.. ఈయన రమా ప్రభను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు..
అయితే నా ఆస్తి కోసమే శరత్ బాబు నాకు దగ్గర అయ్యాడు అని కలిసి ఉన్న 10 ఏళ్లలో అతనికి నా అవసరం ఉంది కాబట్టే ఉన్నాడు అని నన్ను రోడ్డు మీద నిలబెట్టారు అంటూ విమర్శలు చేసింది. ఈ విమర్శలకు శరత్ బాబు సైతం కౌంటర్ ఇచ్చారు.. నేను ఆమె నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అని పైగా 60 కోట్ల విలువ చేసే ప్రాపర్టీస్ ఆమె, ఆమె తమ్ముడు పేరున రిజిస్టర్ చేయించాను అని చెప్పుకొచ్చారు..
అలాగే నాకంటే 7 ఏళ్ళు పెద్ద అయిన కూడా ఆమెను పెళ్లి పెళ్లి చేసుకున్న.. అప్పుడు నాకు బయట ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియదు.. అది అసలు పెళ్లే కాదు.. ఒక కలియిక అంతే అన్నారు.. ఆ తర్వాత ఈయన రెండవ పెళ్లి చేసుకున్న అది కూడా నిలవలేదు అనే చెప్పాలి..