
Sarath Babu assets : వెటరన్ యాక్టర్ శరత్ బాబు అంటే మన టాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియా భాషల్లో అందరికి పరిచయమే.. ఈయన సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 5 దశాబ్దాలు అవుతుంది.. అయిన కూడా ఈయన నిన్న మొన్నటి వరకు సినిమాలు చేస్తూనే ఉన్నాడు.. కానీ గత రెండు మాసాలుగా శరత్ బాబుకు ఆరోగ్యం బాగుండక పోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అయినా కూడా ఈయనను డాక్టర్స్ కాపాడలేక పోయారు.. సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ రోజు ఈయన సుదిస్వాస విడిచారు.. 1973లోనే నటన మీద ఉన్న మక్కువతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.. 1974లో ఈయన హీరోగా పరిచయం అయ్యాడు.. ఇక అప్పటి నుండి.. కెరీర్ లో బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్నో అందుకున్నాడు..
ఇదిలా ఉండగా శరత్ బాబు మరణించడంతో ఈయన ఆస్తుల గురించి లైఫ్ లో పడ్డ కష్టనష్టాల గురించి నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.. ఈయన ఆస్తులు ప్రజెంట్ 60 కోట్లుగా చెబుతున్నారు.. ఇక ఈయన తన సినీ కెరీర్ లో అవమానాలు కూడా ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది.
రమా ప్రభను ఈయన ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. పెళ్లి తర్వాత ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది.. ఇక ఈమెతో విడాకుల తర్వాత కెరీర్ పరంగా కూడా సినిమాలు చేజార్చుకున్నట్టు టాక్.. ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో పోటీ పడుతున్నాడని అప్పట్లో ఈయన 50 అవకాశాలను కోల్పోయేలా చేసినట్టు రూమర్స్ వైరల్ అయ్యాయి..