
Sarath Babu first film : కొద్దిసేపటి క్రితం వెటరన్ నటుడు సరితా బాబు కన్నుమూశారు.. ఈయన 71 సంవత్సరాల వయసులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.. దాదాపు 2 నెలలుగా ఈయన అనారోగ్యంగా బాధ పడుతుండగా.. హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందుతూ ప్రాణాలతో పోరాడి ఈ రోజు తుది శ్వాస విడిచారు.
మరి ఈయన మరణ వార్త అలా తెలిసిందో లేదో ఈయన పెళ్లి, సినీ లైఫ్ గురించి రకరకాల వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. వెటరన్ యాక్టర్ శరత్ బాబు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో జన్మించిన శరత్ బాబు 22 ఏళ్ల వయసులోనే నటుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు.
1974లో రామరాజ్యం అనే సినిమాలో హీరోగా పరిచయం అయ్యాడు.. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాలలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా చేసి ఆడియెన్స్ ను అలరించిన శరత్ బాబు చివరి సారిగా నటించిన సినిమా ఏంటో తెలుసా.. ప్రస్తుతం శరత్ బాబు వయసు 71 సంవత్సరాలు..
ఈయన ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరం అయ్యారు.. ఆరోగ్యం సహకరించక పోవడంతో శరత్ బాబు గత కొన్నాళ్లుగా సినిమాలను పూర్తిగా తగ్గించారు. మరి ఈయన నటించిన లాస్ట్ సినిమా మళ్ళీ పెళ్లి అని తెలుస్తుంది. నరేష్ – పవిత్ర లోకేష్ జంటగా నటించిన మళ్ళీ పెళ్లి సినిమాలో ఈయనను చివరిసారిగా చూడబోతున్నాం..