
Sarath Babu last desire : 1951లో జన్మించిన శరత్ బాబు 2023లో అంటే 71 సంవత్సరాల వయసులో మరణించారు.. వెటరన్ యాక్టర్ శరత్ బాబు అంటే మన టాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియా భాషల్లో అందరికి పరిచయమే. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన శరత్ బాబు అనారోగ్య కారణాలతో రెండు నెలలుగా పోరాడు తున్నారు..
ఇక నిన్న ఈయన తుదిశ్వాస విడిచారు.. అయితే శరత్ బాబు తన చివరి కోరిక తీరకుండానే మరణించినట్టు తెలుస్తుంది.. మరి శరత్ బాబు చివరి కోరిక ఏంటి? ఆయన ఎలాంటి కోరిక తీరకుండానే మరణించారు? అనేది తెలుసుకుందాం.. హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్య కారణాలతో చేరిన విషయం తెలిసిందే..
ఆయన శరీరం మొత్తం విషబారినట్టు వైద్యులు తెలిపారు.. కాలేయం, కిడ్నీ, గుండె పని చేయకుండా పడిపోవడంతో ఈయన మరణించినట్టు డాక్టర్స్ చెబుతున్నారు.. ఈయన తన కెరీర్ లో 250 చిత్రాల్లో నటించారు.. 5 దశాబ్దాలుగా సౌత్ లోని అన్ని భాషలతో పాటు హిందీలో కూడా పలు సినిమాలు చేసి మెప్పించారు. అయినా కూడా ఈయన చివరి కోరిక తీరలేదట..
ఈయన సినిమాలు ఆపేసి వ్యక్తిగతంగా హార్సిలీ హిల్స్ లో సెటిల్ అవ్వాలనేది ఆయన కోరికట.. అందుకే అక్కడ ఇల్లు కూడా కట్టిస్తున్నాడు. ఇంకా ఇల్లు నిర్మాణం పూర్తి కాకుండానే శరత్ బాబు మరణించారు.. దీంతో ఆయన చివరి రోజుల్లో అక్కడ గడపాలనే చివరి కోరిక తీరకుండానే కానరాని లోకాలకు వెళ్లిపోయారు..