30.9 C
India
Saturday, May 17, 2025
More

    Saurabh Netrawala : T20లో పాక్‌ను చిత్తుగా ఓడించిన అమెరికా ప్లేయర్ సౌరభ్ నేత్రవాలా.. ఆయన ఎవరో తెలుసా?

    Date:

    Saurabh Netrawala
    Saurabh Netrawala
    Saurabh Netrawala : ఆతిధ్య దేశం అమెరికాలో T20 వరల్డ్ కప్-2024లో కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఆతిధ్యదేశం అమెరికా పాక్‌పై విజయ దుందుభి మోగించింది. డల్లాస్‌లో జరిగిన మ్యాచులో పాక్‌పై అమెరికా సూపర్ ఓవర్ లో విజయం కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 159/7 పరుగులకే చతికిల పడింది.

    ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన అమెరికా కూడా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇందులో అమెరికా ఒక వికెట్ నష్టాలనికి 18 పరుగులు చేయగా.. పాకిస్తాన్ ఒక వికెట్ నష్టానికి కేవలం 13 మాత్రమే చేసింది. సూపర్ ఓవర్ తో అమెరికా పాక్ పై విజయం సాధించింది. ఈ సూపర్ ఓవర్‌లో పాకిస్తాన్ ను ఓడించిన బౌలర్ సౌరభ్ నేత్రవాలాకర్ ఎవరని ఆయన గురించి తెలుుకునేందుకు క్రికెట్ అభిమానులు, నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.

    భారత సంతతికి చెందిన వ్యక్తే ఈ సౌరభ్ నేత్రవాలాకర్. 1991, అక్టోబర్ 16న ముంబైలో జన్మించిన నేత్రావాలాకర్ అండర్ 19 వరల్డ్ కప్ 2010లో టీమిండియా తరఫున ఆడాడు. భారత క్రికెట్ లో పోటీని తట్టుకోలేకపోయాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ పేసర్ ఎలాంటి పిచ్ పైనైనా బౌన్స్ వేయగలడు. గురువారం (జూన్ 06) పాక్ తో జరిగిన మ్యాచ్ లో ప్రతిభ చూపి పాక్ ను ఓడించాడు.

    ఇండియాలోనే పుట్టి పెరిగిన నేత్రవాలాకర్ 2015లో అమెరికా వెళ్లాడు. అమెరికా జట్టు తరఫున క్రికెట్ ఆడుతూ అదరగొట్టేవాడు. నేత్రవాలాకర్ అప్పట్లో ముంబై తరఫున రంజీ ట్రోఫీలో ఆడాడు. కేఎల్ రాహుల్, హర్షల్ పటేల్, మయాంక్ అగర్వాల్, సందీప్ శర్మ, జయదేవ్ ఉనద్కత్ వంటి వారు అతడి టీమ్‌మేట్లు. నేత్రవాలాకర్ క్రికెటర్ మాత్రమే కాదు.. ఓ ఇంజినీర్ కూడా ఒరాకిల్‌లో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూనే తనకు ఇష్టమైన గేమ్ క్రికెట్లో రాణిస్తున్నాడు.

    Share post:

    More like this
    Related

    IPL: ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టు ఎన్ని గెలవాలంటే!

    IPL 2025 : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన...

    MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ!

    MS Dhoni : ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలకు...

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Amar Deep : నా లవర్ ని నా కళ్ళ ముందే… ఎట్టకేలకు ఆ రహస్యం బయటపెట్టిన బిగ్ బాస్ అమర్ దీప్!

    Amar Deep : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో పాప్యులర్ అయిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ వేళ ప్రవాసుల సందిగ్ధం..

    T20 World Cup : క్రికెట్ అనేది ఇంగ్లాండ్ లో పుట్టినా.....