
Nobel Prize 2023 : ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుమతి నోబెల్. పలు రంగాల్లో నిష్ణాతులైన వారికి ఈ అవార్డు దక్కుతుంది. వైద్య శాస్త్రంలో విశేషంగా సేవలందించిన న్యక్లియో సైడ్ బేస్ మాడిఫికేషన్లలో ఆవిష్కరణలు చేసిన ఇద్దరికి ఈ అవార్డు దక్కింది. కొవిడ్ 19 సమయంలో సమర్థవంతమైన సేవలందించిన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల తయారీలో కీలక పాత్ర పోషించినందుకు వీరికి ఈ అవార్డు సొంతమైంది.
స్వీడన్ లోని స్టాక్ హోంలో ఉన్న కరోలిన్ స్కా ఇన్ స్టిట్యూట్ లోని నోబెల్ ప్రతినిధులు సోమవారం ప్రకటించారు. హంగేరికి చెందిన కాటలిన్ కరికో అమెరికాకు చెందిన వెయిస్ మన్ యూనివర్సిటీ ఆఫ్ పెన్విల్వేనియాలో వీరిద్దరు కలిసి పరిశోధనలు చేశారు. దీంతో వ్యాక్సిన్లను కణాల్లోకి పంపినప్పుడు అవి ప్రతిచర్యను అడ్డుకోవడంతో పాటు శరీరంలో ప్రొటీన్ ఉత్పత్తిని పెంచుతాయని గుర్తించారు.
2005లో వీరు ఓ పేపర్ ను పబ్లిష్ చేశారు. అప్పట్లో అది అంతగా గుర్తింపు పొందలేకపోయింది. కొవిడ్ మహమ్మారి సమయంలో వ్యాక్సిన్లు బాగా పనిచేశాయి. దీంతో కొవిడ్ మహమ్మారి తగ్గుదల అయిపోయింది. 2020 ఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు బాగా ఉపకరించాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టాయి. కోట్లాది మంది ప్రాణాలు పోకుండా కాపాడాయి.
వైద్య విభాగంలో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం వారం రోజుల పాటు నిర్వహిస్తారు. మంగళవారం భౌతిక శాస్త్రం, బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం విభాగాల్లో గ్రహీతల పేర్లు ప్రకటిస్తారు. శుక్రవారం శాంతి బహుమతి, అక్టోబర్ 9న అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లు వెల్లడిస్తారని కమిటీ తెలియజేసింది. 1896లో ఆల్ ఫ్రెడ్ నోబెల్ మరణించగా 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డుల ప్రదానం చేస్తున్నారు.