27.9 C
India
Thursday, September 10, 2026
More

    Scan.. See the scams : చేయండి.. స్కామ్ లు చూడండి.. తెలంగాణలో కర్ణాటక తరహా ప్లాన్!

    Date:

    Scan.. See the scams :

    కర్ణాటకలో ఎన్నికల ముందు సరిగ్గా ఇలాగే జరిగింది. ఇప్పుడు తెలంగాణలోనూ అదే తరహా ప్రచారం జరుగుతోంది. అప్పుడు కర్ణాటకలో బొమ్మై సారథ్యంలో బీజేపీ ప్రభుత్వంపై ఈ ప్రచారం కొనసాగింది. పెయిడ్ సర్కారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సీఎం బొమ్మై ప్రతి దాంట్లో 40 శాతం కమిషన్ తీసుకుంటున్నారని ప్రచారం సాగింది. ఇది కూడా బొమ్మై సర్కారు ఓటమిలో కీలకంగా మారింది.

    అయితే తాజాగా ఇప్పుడు తెలంగాణలోని పలు గ్రామాల్లో సీఎం కేసీఆర్ సర్కారు పై ఇదే క్యూ ఆర్ కోడ్ పోస్టర్లు వేశారు. ఈ క్యూ ఆర్ కోడ్లు స్కాన్ చేస్తే బీఆర్ఎస్ వైఫల్యాలు, స్కామ్ లతో కూడిన ఫీడీఎఫ్ వస్తున్నది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ఈ పోస్టర్లు ప్రస్తుతం వెలిశాయి.స్కాన్ చేయండి .. బీఆర్ఎస్ గొప్పతనాలు చూడండి అంటూ క్యూ ఆర్ కోడ్ లతో పోస్టర్లు వెలిశాయి.

    అయితే ఓ వైపు రాష్ర్ట ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల వేళ ప్రభుత్వ పథకాల మీద పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నది. అట్టహాసంగా జరుగుతున్న ఈ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం తను పేదలకు చేస్తున్న మంచిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నది. అయితే ఇలాంటి సమయంలో ఈ పోస్టర్లు వెలువడడం కలకలం రేపుతున్నది. ఒక్క జోగులాంబ గద్వాల జిల్లాకే పరిమితమయ్యాయా.. లేదంటే రాష్ర్టమంతా వీటిని వేశారా అనేది తేలాల్సి ఉంది. అయితే ఈ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఒక పీడీఎఫ్ డౌన్ లోడ్ అవుతున్నది. పేపర్ లీక్స్, ఢిల్లీ లిక్కర్ స్కామ్,  కాళేశ్వరం  ప్రాజెక్ట్, రైతు ఆత్మహత్యల పూర్తి వివరాలు ఇందులో ఉన్నాయి. మారాల్సిన సమయం వచ్చిందని మా బతుకులు మనమే బాగు చేసుకుందామని అందులో ఉంది. అయితే మరి ఈ క్యూ ఆర్ కోడ్ కూడా కర్ణాటకలో లాగే ఏదైనా సంచలనం సృష్టిస్తుందా.. లేదంటే పేలని చిచ్చుబుడ్డిలాగే అలాగే ఉంటుందా వేచి చూడాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Online Frauds : ఆన్ లైన్ మోసాలను అరికట్టలేరా.. ఇది చిన్న పనే అయినా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు

    online frauds : డిజిటల్‌ లావాదేవీలు అందుబాటులోకి రావడంతో ఆన్‌లైన్‌ మోసాల...

    Fake Parcel Scam : వరల్డ్ కప్ కోసం ఫ్లిప్ కార్ట్ లో సోనీ టీవీ కొన్నాడు.. విప్పి చూస్తే షాక్ లగా

    Fake Parcel Scam : ఆన్ లైన్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి....