BRS తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ రాజకీయ పార్టీలు రోజుకో కొత్త హామీలను ఇస్తూ ఓటర్లను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అందులో అన్నీ పార్టీల కంటే ముందు ఉందనే చెప్పాలి.
రాబోయే ఎన్నికలలో మరోసారి అధికారం దక్కించుకోవడం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు ప్రకటించిన పథకాల అమలుకు ఆదేశాలిచ్చాడు. అలాగే కొత్త పథకాలను ప్రకటించే ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తుంది.
బీఆర్ఎస్ అంటే ప్రజలలో రోజురోజుకు ఆదరణ తగ్గుతూ వస్తుంది. కానీ హామీలను నెరవేర్చడంలో కొంత విఫలం అయిందని పలువురి అభిప్రాయం. తమ ప్రభుత్వంపై గల అసంతృప్తిని తగ్గించి నమ్మకం కుదిరేలా చేసేందుకు కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నాడు కేసీఆర్. కానీ ఇప్పటికే ఉన్న పథకాల అమలు కు రాష్ట్ర ఖజానా సరిపోవడం లేదు. ఇక ఇప్పుడు ఇస్తున్న హామీలను నెరవేర్చడానికి అప్పులు చేయాల్సిన పరిస్ధితి. కానీ అడ్డగోలు అప్పు కు కేంద్రం నుంచి సహాకారం అందడం లేదు.
తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు అదనంగా కావాల్సిన అప్పుల పర్మిషన్లు తీసుకురావడానికి ఢిల్లీ కి వెళ్ళాడు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రతీ నెలా ఆర్బీఐ నుంచి సుమారు నాలుగు వేల కోట్ల రూపాయిలు అప్పుగా తీసుకుంటుంది. దీని కోసం భారీగా భూములను అమ్మేస్తున్నారు. ఇక గ్యారెంటీ అప్పులు తీసుకునేందుకు ప్లాన్ చేస్తుంది. అయితే గత సంవత్సరం నుంచి కేంద్రం, ఆర్బీఐ కొత్తగా కొన్ని నిబంధనలను విధిస్తూంది. గ్యారెంటీ అప్పు తీర్చడంపై నివేదిక ఇస్తేనే అంగీకరిస్తున్నాయి.
కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు దగ్గర పడుతుండటం, హామీల అమలుకు నిధుల కొరత వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ చాలా స్కీంల అమలు కోసం గ్యారంటీ అప్పులను ఉపయోగించాలని చూస్తుంది. జూన్ మొదటి వారంలో ఇవ్వవలిసిన రైతుబంధు జులై నెల చివర వరకు కూడా పూర్తి కాలేదు. ఇంకా సుమారు రూ.2,500 కోట్లు ఉంటేనే రైతుబంధు పూర్తవుతుంది. ఇక గృహలక్ష్మి స్కీంలో ఇంతవరకు అప్లికేషన్ ప్రక్రియ కూడా ఇంతవరకు ప్రారంభం కాలేదు. దళితబంధు, బీసీ లో చేతి వృత్తుల వారికి రూ. లక్ష ఆర్థిక సాయం అయోమయంలో ఉన్నాయి. రీసెంట్ గా మైనార్టీలకు రూ. లక్ష ఆర్థిక సాయం, పెంచిన దివ్యాంగుల పెన్షన్ల కు ఉత్తర్వులు కూడా ఇచ్చారు. వీటన్నీటి అమలు కోసం కావాల్సిన నిధులను సమకూర్చుకోవడం కేసీఆర్ కు పెద్ద టాస్క్ గా పలువురు ఆర్ధిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.