39.9 C
India
Tuesday, April 21, 2026
More

    నిత్య య‌వ్వ‌నులుగా బ‌తికేయ్యుచ్చు.. కొత్త టెక్నిక్‌ను క‌నుగొన్న శాస్త్ర‌వేత్త‌లు!

    Date:

    young
    young forever 
      మ‌నిషులు నిత్య య‌వ్వ‌నులుగా బ‌తికేందుకు శాస్త్ర‌వేత్త‌లు కొత్త టెక్నిక్‌ను క‌నుగొన్నారు. వ‌య‌స్సుతో సంబంధం లేకుండా య‌వ్వ‌నులుగా జీవించేందుకు కొత్త టెక్నాల‌జీని క‌నిపెట్టారు. మ‌నిషి వ‌య‌స్సుతో పాటు క‌ణాల వ‌య‌స్సును కంట్రోల్ చేసే మార్గాల‌ను అన్వేషించారు. త‌ద్వారా మ‌నిషి జీవిత కాలంలో ఎలాంటి రోగాలు,వ్యాధుల బారిన ప‌డ‌కుండా నిత్యం హెల్దీగా ఉండేలా శాస్త్ర‌వేత్త‌లు టెక్నిక్‌ను క‌నుగొన్నారు.

    అమెరికాలోని శాన్ డియాగో యూనివ‌ర్శిటీ ప‌రిశోధ‌కులు క‌ణాల పెరుగుద‌ల నియంత్ర‌ణ‌పై కొత్త అంశాల‌ను తెర‌పైకి తెచ్చారు. స‌హ‌జంగా మ‌నిషి శ‌రీరంలోని క‌ణాలు నిత్యం క్షీణిస్తూ ఉంటాయి. వాటి స్థానంలో కొత్త క‌ణాలు అభివృద్ది చెందుతుంటాయి. అయితే ఈ ప్ర‌క్రియ మ‌నిషి వ‌య‌స్సు పెరిగేకొల‌దీ క‌ణాల పుట్టుక‌,క్షిణ‌త త‌గ్గుతూ వ‌స్తుంటుంది. ఇది మాన‌వ శ‌రీరం,జీవ‌జాతుల్లో స‌హ‌జంగా జ‌రిగే ప్ర‌క్రియ‌నే. అయితే ఇందుకు భిన్న ప‌ద్ధ‌తుల‌ను అమెరికా సైంటిస్టులు ఆవిష్క‌రించారు.

    శాన్‌డియోగో వ‌ర్శిటీ శాస్త్ర‌వేత్త‌లు క‌ణాల పెరుగుద‌ల నిత్యం అలాగే కొన‌సాగేలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ విధానాన్నే వారు ప్రోగ్రామింగ్ రీ ప్రోగ్రామింగ్ అని పిలుస్తున్నారు. మొద‌ట‌గా ఈప్ర‌క్రియ‌ను వారు ఈస్ట్ క‌ణాల‌పై చేశారు. వాటిపై శాస్త్ర‌వేత్త‌లు చేసిన ప్ర‌యోగం స‌క్సెస్ కావ‌డంతో..ప్ర‌స్తుతం మాన‌వ క‌ణాల‌పై ప్రోగ్రాం చేస్తున్నారు. కణజాలాల ఏజింగ్ ప్రాసెస్‌ను రీప్రోగ్రాం చేయ‌డం వ‌ల్ల క‌ణాల వ‌య‌స్సు పెర‌గ‌కుండా చూడొచ్చ‌ని చెబుతున్నారు సైంటిస్టులు. క‌ణాల వ‌య‌స్సును పెర‌గ‌కుండా చేస్తే మ‌నిషి నిరంత‌రం ఒకేలా ఉంటాడ‌ని అంటున్నారు. అయితే వీరి ప్ర‌యోగాలు ఎలా ఉన్నా..ఇలాంటి ప్ర‌యోగాలు ఎలాంటి పెను విప‌త్తుల‌కు దారి తీస్తాయోన‌ని ప‌లువురు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. సృష్టికి ప్ర‌తి సృష్టి చేసే లాంటి మెథ‌డ్‌ల‌ను అనుస‌రించ‌డం వ‌ల్ల ఏ ర‌క‌మైన దుష్ఫ‌రిణాలు సంభ‌విస్తాయోన‌నే ఆవేద‌న చెందుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Fungal infection : పెరుగుతున్న ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్ సంక్షోభం.. ఆందోళన వ్యక్తం చేస్తున్న శాస్త్రవేత్తలు  

    Fungal infection : ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌లు అభివృద్ధి చెంది భయాందోళన కలిగిస్తున్నాయి....

    Bee Venom : తేనెటీగ విషంతో కేవలం గంటలోనే క్యాన్సర్ కణాలు నాశనం

    Bee Venom : ప్రపంచవ్యాప్తంగా మరణాలకు రెండో ప్రధాన కారణం క్యాన్సర్. ప్రతేడాది 10మిలియన్ల మంది క్యాన్సర్ తో మరణిస్తున్నారు.

    Chandrayaan 3 : చంద్రయాన్ 3 లో నిజమైన హీరోలు వారేనా.. ఇండియన్ మీడియా పట్టించుకోలేదా..?

    Chandrayaan 3 : చంద్రయాన్ 3 విజయవంతమైంది. ఎందరో  ఏళ్ల కష్టం.....