20 C
India
Saturday, January 17, 2026
More

    Makara Jyothi : మకర జ్యోతి దర్శనం.. ‘స్వామి’ నామస్మరణతో మార్మోగిన శబరిమల

    Date:

    Makara Jyothi
    Makara Jyothi

    Sabharimala Makara Jyothi : సంక్రాంతి పర్వదినం రోజున శబరిమలలో మంగళవారం సాయంత్రం అయ్యప్ప స్వామి మకరజ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మకర జ్యోతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు శబరిమలకు తరలివచ్చారు. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.

    తిరువాభరణ ఘట్టం పూర్తయ్యాక పొన్నంబలమేడు పర్వత శిఖరాల్లో మకరజ్యోతి దర్శనమిచ్చింది. లక్షలాదిగా అయ్యప్పస్వామి భక్తులు మకరజ్యోతి దర్శించుకొని అయ్యప్ప కృపకు పాత్రులయ్యారు. మకర జ్యోతి దర్శనంతో శబరిమల అయ్యప్పస్వామి నామస్మరణతో మార్మోగిపోయింది.

    దేవతలు, రుషులు హారతిస్తారనే భక్తుల నమ్మకం..

    కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని అయ్యప్ప భక్తుల నమ్మకం. మకర సంక్రాంతి రోజున పందాళం నుంచి తీసుకువచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించారు. అనంతరం మూలమూర్తికి హారతినిచ్చారు. ఆ వెంటనే క్షణాల్లో చీకట్లను తొలగిస్తూ పొన్నాంబలంమేడు పర్వత శిఖరాల్లో జ్యోతి దర్శనమిచ్చింది.

    అయ్యప్పస్వాములు, భక్తులు మకర జ్యోతిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్ భారీగా ఏర్పాట్లు చేసింది. స్వాములు, భక్తులంతా మకర జ్యోతిని ప్రశాంతంగా దర్శించుకున్నారు. మరోవైపు కోట్లాది మంది భక్తులు టీవీలు, ఇతర ప్రసార మాధ్యమాల్లో మకర జ్యోతిని దర్శించుకొని స్వామివారిని స్మరించుకున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related