Kapil Captaincy : భారత్ లో క్రికెట్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. క్రీడా పరంగా చేస్తే ఈ దేశానికి చెందినది కాకపోయినా.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతీ ఒక్కరూ బ్యాట్, బాల్ పట్టుకోలేదంటే సందేహం లేదు. ఇక ప్రపంచ యవనికపై భారత్ క్రికెట్ పరంగా రికార్డులను సృష్టిస్తూనే ఉంది. ఇటు ఆట పరంగా.. అటు క్రీడా కారుల పరంగా కూడా ప్రపంచలోనే మొదటి వరుసలో ఉన్నారు మన క్రీడాకారులు.
కపిల్ దేవ్ భారత్ కు ఒక దశలో కేప్టెన్ గా వ్యవహరించాడు. 1959, జనవరి 6వ తేదీన పుట్టిన ఆయన చదువుకునే రోజుల నుంచి క్రికెట్ ను ఆరాధ్య క్రీడగా అభిమానించేవాడు. 1975 నుంచి క్రికెట్ రాష్ట్ర జట్టలో ఆడడం ప్రారంభించాడు. ఇక ఫస్ట్ టెస్ట్ 1978, అక్టోబర్ 16న, ఫస్ట్ వన్ డే 1978, అక్టోబర్ 1న ఆడాడు. కపిల్ దేవ్ ఆల్ రౌండర్ గా ఉన్నాడు. కానీ ఎక్కువగా ఆయన బౌలింగ్ పైనే దృష్టి పెట్టేవారు. క్రికెట్ చరిత్రలోనే 400 కంటే ఎక్కువ వికెట్లు తీసిన రికార్డ్ ఆయన సొంతం.
1983 లో జరిగిన వరల్డ్ కప్ లో ఆయన కేప్టెన్ గా వ్యవహరించారు. భారత్ కు మొదటి వరల్డ్ కప్ తెచ్చిన కేప్టెన్ గా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. వరల్డ్ కప్-2023 దగ్గర పడుతుండడంతో ఆయన మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కపిల్ దేవ్ మాట్లాడుతూ ‘తనను కేప్టెన్ గా ఎన్నుకునే సమయంలో సెలక్టర్లు ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే నాకు ఇంగ్లిష్ రాదని, వరల్డ్ లోనే ఇంగ్లిష్ రాని మొదటి కేప్టెన్ నేను అవుతాను అని. అయితే నేను ఒక విషయం చెప్పా. ఇంగ్లిష్ మాట్లాడేందుకు ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి నుంచి వ్యక్తులను తీసుకు రండి. అతను మాట్లాడుతాడు నేను అడుతాను అని చెప్పా. అది అలా జరిగిపోయింది.
కొంత కాలం తర్వాత సెలక్టర్ లో ఒక క్లబ్ నిర్మించారు. ఓపెనింగ్ చేయాలని నన్ను పిలిచారు. అప్పుడు నేను చెప్పాను నాకు ఇంగ్లిష్ రాదుగా ఏం మాట్లాడాలి అని. అప్పటికి నేను ఇంగ్లిష్ మాట్లాడడం నేర్చుకున్నారు. క్లబ్ ను ప్రారంభించి ఇంగ్లిష్ లో స్పీచ్ ఇచ్చాను. మీరు ప్రతిరోజూ నేర్చుకోవాలి. మీరు నేర్చుకోలేకపోతే విజయం సాధించలేరు.’ అని చెప్పాడు కపిల్ దేవ్.