Selfie with Lion : మృగరాజైన సింహంతో ఆట అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవడమే. సర్కర్ తో పాటు, జూలో ట్రైనింగ్ తీసుకున్న శిక్షకులు కూడా వాటి వద్ద చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. సింహం అంటే ఆశామాషీ జంతువు కాదగా.. అందుకే అడవికి రాజైంది. ఇదంతా పక్కన పెడితే సింహంతో సెల్ఫీ దిగుతాం అనుకున్న వ్యక్తిని చంపేసింది. తిరుపతి జూలో జరిగిన ఈ ఘటన దేశాన్ని ఒక్క సారిగా కుదిపేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చూద్దాం.
తిరుపతి జూలోని సింహం ఎన్ క్లోజర్ లో ఓ వ్యక్తి సెల్ఫీ దిగేందుకు వెళ్లాడు. సింహం అతనిపై దాడి చేసి చంపేసింది. ఈ సంఘటన గురువారం(ఫిబ్రవరి 15వ తేదీ) మధ్యాహ్నం జరిగింది.
శ్రీ వేంకటేశ్వర జువలాజికల్ పార్క్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వార్ కు చెందిన ప్రహ్లాద్ గుజ్జర్ (38) అనే వ్యక్తి ప్రజలకు అనుమతి లేని ప్రాంతంలోకి ప్రవేశించి సింహం ఎన్ క్లోజర్ లోకి వెళ్లాడు. ఆ తర్వాత గుజ్జర్ 25 అడుగులకు పైగా ఎత్తైన కంచె ఎక్కి ఎన్ క్లోజర్ లోకి దూకాడు. సింహాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరించినట్లు సమాచారం. సింహం దాడి చేయడంతో చెట్టు ఎక్కి తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేశాడు.
కేర్ టేకర్ స్పందించే లోపే ‘దొంగల్ పూర్’ అనే సింహం గుజ్జర్ ను కొట్టి చంపింది. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఆ సమయంలో ప్రహ్లాద్ గుజ్జర్ మద్యం తాగి ఉన్నాడో లేదో తెలియదు. జంతు ప్రదర్శనశాలలో కుమార్, సుందరి, దొంగల్ పూర్ అనే మూడు సింహాలు ఉన్నాయి. మనిషిని చంపిన సింహం దొంగల్ పూర్ ను బోనుకు తరలించి అబ్జర్వేషన్ లో ఉంచారు.
Man dares lion for a selfie, jumps into enclosure, gets mauled.
40-year-old Prahlad Gujjar jumped into a lion enclosure for a selfie in Tirupati SV Zoo park. He also behaved in a way to provoke the lion. After the lion attacked him, he made an in vain attempt to save himself by… pic.twitter.com/4vWaRNkSZM
— Sudhakar Udumula (@sudhakarudumula) February 15, 2024