
Pavithra Husband : సినిమా పరిశ్రమలో నరేష్, పవిత్రల ప్రేమ కొత్తపుంతలు తొక్కుతోంది. లేటు వయసులో కూడా ఘాటైన ప్రేమను పండిస్తున్నారు. చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. యాభై ఏళ్లు దాటినా నవ యవ్వనంలా ఫీలవుతున్నారు. వెకేషన్లకు వెళ్తూ సరదాలు తీర్చుకుంటున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోతున్నారు. వారిద్దరు చేస్తున్న చేష్టలు పరిశ్రమ మొత్తం పరిశీలిస్తోంది.
టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఎట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ఈనేపథ్యంలో పవిత్ర మాజీ భర్త సుచేంద్ర ప్రసాద్ ఆమె గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పవిత్రకు డబ్బు పిచ్చి ఉందని అన్నాడు. డబ్బున్న వాళ్లతో స్నేహంగా ఉంటుంది. ప్రస్తుతం విజయనిర్మల గారి ఆస్తి రూ.1500 కోట్లు ఉందని అందుకే ఆమెనరేష్ పంచన చేరిందని చెబుతున్నాడు. డబ్బు అయిపోయాక వేరే వారిని చూసుకుంటుందని చెప్పడం గమనార్హం.
ఇక నరేష్, పవిత్రలు మాత్రం స్వచ్ఛమైన ప్రేమికులుగా మారిపోతున్నారు. నరేష్ కు ఇది నాలుగో పెళ్లి కాగా పవిత్రకు రెండో పెళ్లి. ఇలా ఐదు పదులు దాటినా వారు యవ్వనంలో ఉన్నట్లుగా ఫీలవుతున్నారు. వెకేషన్స్ కు వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా వారి ప్రవర్తన ఉంటోంది. దీంతో వారి గురించి పరిశ్రమ మొత్తం కోడై కూస్తోంది.
ఈ వయసులో కూడా వారు అలా తిరగడంలో అర్థం ఏమిటో తెలియడం లేదు. సహజీవనం చేస్తున్నారని చెబుతున్నా వివాహం చేసుకున్నారని కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో పవిత్ర, నరేష్ ల బంధానికి ఏ పేరు పెట్టాలి. ఎలా చూడాలి అనే వాదనలు కూడా వస్తున్నాయి. వారు మాత్రం తెగ రెచ్చిపోయి తిరుగుతున్నారు. ఇద్దరు భార్యాభర్తల్లా అనుకుంటున్నారు.






