Jai swaraajya tv Exclusive : దగ్గుబాటి పురందేశ్వరి గారు ‘జైస్వరాజ్య టీవీ, జేఎస్.డబ్ల్యూ నిర్వహించిన ఇంటర్వ్యూలో చెప్పిన సంచలన విషయాలు పంచుకున్నారు..
చీప్ లిక్కర్ మద్యాన్ని ఆంధ్రరాష్ట్ర ప్రజలకి అందిస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రజల ఉసురు తీస్తున్నారని.. వారి ప్రాణాలు పోయేలా చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. ఆరోగ్యాన్ని హాని చేసే చీప్ లిక్కర్ ను ప్రజలకు అందించి వారి ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఇన్ ప్యూరిటీతో ఉండే అత్యంత హానికర మద్యాన్ని ప్రజలకు సరఫరా చేస్తూ వారి ఆరోగ్యంతో చెలగాటం జగన్ ప్రభుత్వం ఆడుతోందని ఆరోపించారు.