స్మార్ట్ ఫోన్ యూజర్స్ తమ బిల్లుల చెల్లింపు, ప్రమోషన్, టికెట్ బుకింగ్, ఇతర సేవల కోసం స్మార్ట్ ఫోన్ పై ఆధారపడుతున్నారని ఈ అధ్యయనంలో తేలింది. భారతదేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారుడు ఖర్చు చేసే ప్రతి రూపాయికీ రూ.6 ప్రయోజనం పొందుతాడని ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. అది ఎలాగంటే.?
మధ్య తరగతితో పోలిస్తే సంపన్నులకు స్మార్ట్ ఫోన్ల ఆర్థిక విలువ దాదాపు 50 శాతం ఎక్కువగా ఉంది. ఒక మధ్యతరగతి (వార్షిక కుటుంబ ఆదాయం రూ.5 నుంచి 30 లక్షలు) స్మార్ట్ ఫోన్ల ద్వారా పొందే విలువ 10.1 రెట్లు ఎక్కువ. సంపన్నులకు స్మార్ట్ ఫోన్ల ఆర్థిక విలువ 22.5 రెట్లు ఉంది. ఇది దేశానికి బలమైన డిజిటల్ ల్యాండ్ స్కేప్ కు పునాది వేస్తుందని, దీనిలో ప్రజలు అనేక ఆర్థిక కార్యకలాపాలను నిర్వహిస్తారని నివేదిక స్పష్టం చేసింది.
స్మార్ట్ ఫోన్ యూజర్ల ప్రాధాన్యతలు, ప్రవర్తనలు, డెమోగ్రాఫిక్స్ అర్థం చేసుకోవడమే ఈ అధ్యయనం ఉద్దేశ్యమని కంపెనీ తెలిపింది. అహ్మదాబాద్, బెంగళూర్, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, హైదరాబాద్, జైపూర్, కాన్పూర్, కోల్‌కత్తా, లక్నో, ముంబై, నాగ్పూర్, పుణె, సూరత్ సహా మెట్రో, నాన్ మెట్రో నగరాల్లోని 000,14 మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులపై సర్వే నిర్వహించింది. 18 నుంచి 60 ఏళ్ల లోపు పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణులు, కార్పొరేట్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులు ఈ సర్వేకు సహకరించారు. సర్వేలో పాల్గొన్న వారిలో 62 శాతం మంది పురుషులు కాగా, 38 శాతం మంది మహిళలు ఉన్నారు.
వినియోగదారుడు తన ఫోన్ ద్వారా నిర్వహించే డిజిటల్ కార్యకలాపాల నుంచి పొందిన ఆర్థిక విలువను కూడా ఈ అధ్యయనం ప్రముఖంగా చూపింది. సర్వీస్ బుకింగ్, నియామకాలు అత్యంత లాభదాయకమైన డిజిటల్ యాక్టివిటీగా అవతరించాయని, పెట్టుబడికి 8 రెట్లు రాబడి వచ్చిందని తెలిపింది.
ఆ తర్వాతి స్థానాల్లో కిరాణ కొనుగోళ్లు 7.9 రెట్లు, యుటిలిటీ బిల్లులు, షాపింగ్ 7.6 రెట్లు, నిత్యావసరాలు 7.4 రెట్లు, డిజిటల్ నగదు 6.9 రెట్లు ఉన్నాయి. 41 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కుల సగటు ఆర్థిక విలువ 7.7గా ఉండగా, ఇది 7 నుంచి 6 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులలో 25.40 గా ఉంది. దేశంలోని మెట్రో (7.6 రెట్లు), నాన్ మెట్రో (6.2 రెట్లు) నగరాలకు స్మార్ట్ ఫోన్ ఆర్థిక విలువ దగ్గరగా ఉందని అధ్యయనం పేర్కొంది.
ReplyForward
|