
Balayya to Ram Charan : రాం చరణ్-ఉపాసన దంపతులు మంగళవారం ఉదయం పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చారు. తెల్లవారు జామున 1.49 గంటలకు మెగా ప్రిన్సెస్ గా ఆడపిల్ల పుట్టింది. చిరుతో పాటు ఆయన అభిమానులు కూడా ఖుషీగా ఉన్నారు. అందరూ చిన్నారికి వెల్ కమ్ చెప్తున్నారు. దాదాపు మంగళవారం మొత్తం సోషల్ మీడియాలో మెగా ప్రిన్సెస్ హవా కొనసాగింది. అయితే, రాం చరణ్ కంటే ముందు మొదటి సంతానంగా ఆడబిడ్డకు జన్మనిచ్చిన హీరోల గురించి తెలుసుకుందాం..
ఆ ముగ్గురు స్టార్ హీరోలకు..
చిరంజీవికి మొదటి సంతానంగా అమ్మాయి సుస్మిత జన్మించింది. ఆ తర్వాత చరణ్, శ్రీజలు కలిగారు. మెగాస్టార్ తో పాటు బాలయ్య బాబుకు కూడా మొదటి సంతానంలో బ్రాహ్మాణి పుట్టింది. ఆ తర్వాత తేజస్వీ, మోక్షజ్ఞలు కలిగారు. ఇక, విక్టరీ వెంకటేశ్ నలుగురు పిల్లలకు జన్మనివ్వగా అందులో మొదటి సంతానం ఆడపిల్లే. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు కూడా మొదటి సంతానం లక్ష్మి ప్రసన్న జన్మించింది. ఆ తర్వాత విష్ణు, మనోజ్ పుట్టారు. మోహన్ బాబు సంతానంలో కూడా లక్ష్మీ ప్రసన్నకు, విష్ణుకు మొదటి సంతానం అమ్మాయే. ఇక జీవితా రాజశేఖర్ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలే. రవితేజ దంపతులు కూడా మొదటి సంతానం ఆడపిల్లే. అల్లరి నరేశ్, ఆది సాయి కుమార్, నందమూరి తారకరత్న ఇలా ఎంతో మంది మొదటి సంతానం ఆడపిల్లకే జన్మనిచ్చారు.
బాలీవుడ్‌లోని చాలా మంది హీరోలకు మొదటి సంతానంగా అమ్మాయే జన్మించింది. అనిల్ కపూర్, సైఫ్ అలీ ఖాన్, అజయ్ దేవగణ్, అభిషేక్ బచ్చన్, రణబీర్ కపూర్, షాహిద్ కపూర్ మొదటి సంతానంగా ఆడబిడ్డకే జన్మనిచ్చారు.
కోలీవుడ్(తమిళ ఇండస్ట్రీ)ని పరిశీలిస్తే రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరికీ అమ్మాయిలే పుట్టారు. ఇందులో కమల్ కూతుళ్లు శృతి, అక్షర, రజినీ కూతుళ్లు సౌందర్య, ఐశ్వర్య దర్శకులుగా సత్తా చాటుతున్నారు. మరో స్టార్ మమ్ముట్టికి కూడా మొదటి సంతానంగా కూతురే.
టాలీవుడ్‌లోని ఇప్పటి స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ మొదటి సంతానంగా అబ్బాయిలకు జన్మనిచ్చారు. ఆ తర్వాత వీళ్లకు పాపలు పుట్టారు. వీరిలో జూనియర్ ఎన్టీఆర్ కు ఇద్దరు బాబులే. రాం చరణ్‌కు పాప పుట్టడంతో ఇప్పుడు ఎన్నో అంశాలను తెర మీడికి వస్తున్నాయి.






