
Horoscope :
మేష రాశి వారికి మంచి కాలం. చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. అధికారులను కలిసి పనులు చేయించుకుంటారు. సంతోషంగా గడుపుతారు. శివుడి దర్శనం మంచి చేస్తుంది.
వ్రషభ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకుంటారు. చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. ఆత్మీయులతో సంతోషంగా ఉంటారు. ఇష్టదేవతారాధన శుభం కలిగిస్తుంది.
మిథున రాశి వారికి ధన లాభం ఉంటుంది. ప్రయాణాల్లో లాభాలున్నాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు దక్కుతాయి. కులదైవాన్ని పూజించడం మంచిది.
కర్కాటక రాశి వారికి అనుకూల కాలం. కీలకంగా వ్యవహరించి పలువురి ప్రశంసలు పొందుతారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళితే విజయం మీదే. ఇష్టదేవను పూజించి మంచి ఫలితాలు రాబట్టుకోవాలి.
సింహ రాశి వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పనుల్లో విజయాలున్నాయి. శ్రమ పెరిగినా లాభం ఉంటుంది. నవగ్రహ ధ్యానం చేయడం అన్ని విధాలా బాగుంటుంది.
కన్య రాశి వారికి ముఖ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఈశ్వర నామ స్మరణ మంచి ఫలితాలు తెస్తుంది.
తుల రాశి వారికి భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. చేసే పనుల్లో శ్రమ ఎక్కువవుతుంది. మొహమాటానికి పోతే ఇబ్బందులు వస్తాయి. లక్ష్మీగణపతి ధ్యానం చేయడం ఉత్తమం.
వ్రశ్చిక రాశి వారికి విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రయాణాల్లో లాభాలున్నాయి. వ్యాపారాల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఇష్టదేవత ఆరాధన చేయడం చాలా మంచిది.
ధనస్సు రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవసరానికి సాయం అందుతుంది. విష్ణు సహస్ర నామాలు చదువుకుంటే మేలు కలుగుతుంది.
మకర రాశి వారికి మంచి కాలం. మంచి విజయాలు అందుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి. గాయత్రి మంత్రం జపించడం వల్ల శుభఫలితాలు వస్తాయి.
కుంభ రాశి వారికి ఉత్సాహంగా ఉంటారు. సమస్యలపై పైచేయి సాధిస్తారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పెంచుకుంటారు. గణపతి మంత్రం చదవడం వల్ల మంచి లాభాలుంటాయి.
మీన రాశి వారికి మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పనుల్లో తత్తరపాటు పనికి రాదు. వ్యాపారాల్లో లాభాలు దక్కుతాయి. విష్ణు సహస్ర నామం పారాయణం చేయడం మంచిది.