Bail and Custody : అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ పై బయటకు వచ్చి నేటికి సరిగ్గా 10 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో, జగన్ పై టిడిపి యువ నేత నారా లోకేశ్ సెటైర్లు వేశారు.42 వేల కోట్ల ప్రజాదనం దోచేసి, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1 ముద్దాయ ప్రస్తుత ఏపీ సీఎం జగన్. 2013 సెప్టెంబర్ 23న బెయిల్ పై బయటికి వచ్చారు. పదేళ్లుగా బెయిలుపై ఉన్న ఆర్థిక ఉగ్రవాది జైలు మోహన్ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ, రాజ్యాంగాన్ని కాలరాస్తూ, నీతివంతులను జైలుకు పంపుతున్నాడని టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. జైలులో ఉండాల్సిన జగన్ పదేళ్లుగా బెయిలుపై ఉంటే, జనంలో ఉండాల్సిన నిజాయితీపరుడు సీబీఎన్ జైల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అదే సమయంలో జగన్ కు లోకేష్ శుభాకాంక్షలు చెప్పారు.పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు జైలుమోహన్ అంటూ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది.
Breaking News
Bail and Custody : సెప్టెంబర్ 23.. ఒకరికి బెయిల్.. మరొకరికి కస్టడీ
Date:
2014 నుంచి జగన్ ప్రతి శుక్రవారం కోర్టు విచారణకు హాజరవుతున్నారు. ఈ కేసుల సంక్లిష్ట స్వభావం కారణంగా ఈ కేసులకు సంబంధించిన వివిధ పక్షాలు బహుళ డిశ్చార్జ్ పిటిషన్‌లను దాఖలు చేయడం, సీబీఐ కేసులు పరిష్కరించబడిన తర్వాత మాత్రమే ఈడీ కేసులను కొనసాగించాలని కోర్టును నెట్టడం ద్వారా విచారణలు ఆలస్యం అయ్యాయి. కానీ 2019 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జగన్ రికార్డు మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా దాదాపు 250 శుక్రవారాలు జగన్ కనీసం పది శుక్రవారాలు కూడా కోర్టుకు వెళ్లకుండా ఏదో ఒక కారణంతో గైర్హాజరు పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. ఇది ప్రాథమిక బెయిల్ షరతును ఉల్లంఘించినప్పటికీ చట్టపరమైన ప్రక్రియకు సహకరించడం, కోర్టు ఎప్పుడూ అభ్యంతరం తీసుకోలేదు. ఈ కేసులు 2014లో ఉన్నాయని, కేసులను నెమ్మదించేందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వంతో జగన్ డీల్ కుదుర్చుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
అదే రోజు కస్టడీకి మాజీ సీఎం..
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని విచారించేందుకు సీఐడీకి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరగా, ఏసీబీ కోర్టు మాత్రం రెండు రోజులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. సమయాభావం, ఇతరత్రా కారణాల వల్ల చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులోనే విచారిస్తామని సీఐడీ.. ఏసీబీ కోర్టుకు వివరించింది. కోర్టు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
23, 24వ తేదీల్లో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే చంద్రబాబును విచారించాలని సీఐడీకి కోర్టు ఆదేశించిది. ప్రతి గంటకు ఐదు నిమిషాల చొప్పున బ్రేక్ ఇవ్వాలని సూచించింది. బ్రేక్ సమయంలో చంద్రబాబు తన న్యాయవాదితో మాట్లాడవచ్చని స్పష్టం చేసింది. పోలీసు కస్టడీ సమయంలో విచారణ కనిపించేంత దూరంలో చంద్రబాబు న్యాయవాదిని అనుమతించాలని సీఐడీని ఆదేశించింది. చేసింది. పోలీసు కస్టడీలో ఏ విధంగానూ జోక్యం చేసుకోరాదని, సుప్రీంకోర్టు నిర్ధేశించిన విధంగానే సాయం అందించాలని చంద్రబాబు న్యాయవాదికి కూడా ఆదేశాలు జారీ చేసింది.
బాబును వెంటాడుతున్న 23..
చంద్రబాబుకు జైలు ఇచ్చిన ఖైదీ నంబర్ 7691 పై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో మీమ్స్, కామెంట్స్ ఇప్పటికే వైరల్ అయ్యాయి. అధికారంలోకి ఉన్నప్పుడు చంద్రబాబు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే 2019 ఎన్నికల్లో సరిగ్గా టీడీపీ 23 సీట్లు గెలిచింది. 2023 లో 09-09-23 తేదీన (ఈ అంకెలను కలిపితే 23 వస్తుంది) అలాగే రాజమండ్రి సెంట్రల్ జైలులో అధికారులు చంద్రబాబుకు అలాట్ చేసిన ఖైదీ నంబర్ 7691 నంబర్ ని కూడితే సరిగ్గా 23 వస్తోంది. ఇప్పుడు 23వ తేదీనే చంద్రబాబును సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. అన్నీ వరుసగా 23నే రావడం చంద్రబాబుకు బ్యాడ్ నంబర్ అవుతుందేమో మరి