September 23 : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ‘సెప్టెంబర్ 23’ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ‘స్కిల్ డెవలప్ మెంట్’ కేసులో చంద్రబాబును జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పటి నుంచి పరిణామాలను పరిశీలిస్తే చాలా అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు ‘23’ సంఖ్య అచ్చి రాలేదు. గతంలో ఇతర పార్టీల నుంచి చంద్రబాబు తన పార్టీలోకి లాక్కున్న ఎమ్మెల్యేల సంఖ్య 23, ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిన సీట్లు 23, ఇక ఆయన అరెస్ట్ అయిన తేదీ 09.09.23 మొత్తం 23, ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న నెంబర్ 7691 మొత్తం 23, ఇక ఆ సమయంలో సీబీఐ పెట్టిన విచారణ గడువు 23, ఇవన్నీ కలుపుకొని మళ్లీ 23 నెంబర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో సంచలనం సృష్టిస్తోంది.
గతంలో వైఎస్ జగన్ ఎంపీగా ఉన్న సమయంలో 16 నెలలు చంచల్ గూడ జైలులో ఉన్నారు. అప్పుడు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జగన్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ సమయంలో ఆయన హైదరాబాద్ విడిచి వెళ్లవద్దని, సాక్షులను ప్రభావితం చేయవద్దని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన ఇదే రోజు ‘సెప్టెంబర్ 23’న విడుదలయ్యాడు. ఇక ఈ రోజు ‘సెప్టెంబర్ 23’ చంద్రబాబు నాయుడి కేసు కూడా విచారణకు వచ్చింది. ఇప్పుడు ఆయనకు బెయిల్ దొరుకుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆయనకు బెయిల్ లభించకపోగా రెండు రోజుల రిమాండ్ ను పొడిగించింది కోర్టు.
సెప్టెంబర్ 23 జగన్, చంద్రబాబు నాయుడికే కాకుండా దివంగత ఎన్టీఆర్ కు కూడా ప్రభావితం చేసింది. నందమూరి తారక రామారావు హీరోగా చేసిన సినిమా ‘సీఐడీ’. ఈ మూవీ విజయావారి నిర్మాణంలో వచ్చింది. ఈ సినిమా కూడా 23 సెప్టెంబర్, 1965లో రిలీజ్ అయ్యింది. మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక రామారావు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కూడా సెప్టెంబర్ 23 బాగా ప్రభావితం చేసిందనే చెప్పవచ్చు.