Team India World Cup Team మరో రెండు నెలల్లో క్రికెట్ వన్డే ‘వరల్డ్ కప్’ ప్రారంభమవుతుంది. ఆయా దేశాలు 15 మందితో కూడిన తమ జట్టు వివరాలను ఐసీసీకి సెప్టెంబర్ 5వ తేదీలోగా అందించాలి. అయితే ఇదే ఫైనల్ కాదు. సెప్టెంబర్ 27న మరో జాబితా అందచేయవచ్చు. ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు.. లేదా అదేవిధంగా ఉంచవచ్చు. కానీ సెప్టెంబర్ 27 మాత్రం తుది గడువు. దేశం యావత్తు క్రీడాభిమానుల్లో ఒకటే చర్చ జరుగుతోంది. టీమిండియాలో ఎవరెవరు ఉండబోతున్నారు. ప్రపంచం మొత్తంలో టీం ఇండియాకు ఘనమైన గుర్తింపు ఉంది. విరాట్ లాంటి గ్రేట్ బ్యాట్స్ మన్ తో పాటు మంచి బౌలర్లు ఈ టీములో కూడా ఉన్నారు.
టీమిండియా జట్టులో ఉండే 15 మంది ఎవరనే విషయానికస్తే.. బ్యాటింగ్ విషయంలో గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్న కీలక ఆటగాళ్లు కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ప్రపంచకప్‌నకు అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహుల్ కోలుకున్నాడని, అతడు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కానీ శ్రేయాస్ గాయంపై ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్స్ రాలేదు. వీరిద్దరూ బెంగళూర్ లోని నేషనల్ క్రికెట్ అకాడమీలోనే కోలుకుంటున్నారు. వీరు ఆసియాకప్‌లో ఉండే ఛాన్స్ ఉంది. రోహిత్, కోహ్లి, గిల్ స్థానాలకు ఎటువంటి ఢోకా లేదు. వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ ఎన్నికకావచ్చు. కిషన్‌కు సబ్‌స్టిట్యూట్ గా సంజూ శాంసన్‌ను ఎంపికైనా కూడా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. రాహుల్ కూడా కీపింగ్ చేయగలడని మనకు తెలుసు. రాహుల్ ఈ బాధ్యతలు తీసుకుంటే ఇషాన్ కిషన్ అవసరం ఉండకపోచ్చు. కాబట్టి ఆయనను జట్టులోకి తీసుకోకపోవచ్చు.
పేస్ విషయానికొస్తే జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ ఎంపిక ఖాయంగానే కనిపిస్తోంది. గాయంతో చాలా కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న బుమ్రా కోలుకున్నాడు. ఐర్లాండ్‌తో టీ-20 సిరీస్‌లో కూడా బుమ్రా ఆడనున్నాడు. వీరితో పాటు ఆల్‌రౌండర్ హర్థిక్ పాండ్యా నాలుగో పేసర్‌గా ఉపయోగించుకోవచ్చు. వీరితోపాటు ఆసియాకప్ కోసం శార్దూల్ ఠాకూర్ లేదంటే ముఖేశ్ కుమార్‌ను ఎంపిక చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ కూడా చేయగలడం శార్దూల్‌కు ప్లస్ అవుతుంది. ఇక స్పిన్ కోటాలో కుల్దీప్ యాదవ్ ఖాయం కాగా.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఉంటాడు. మరో స్పిన్నర్‌గా అక్షర్ పటేల్, చాహల్‌కు మధ్య గట్టి పోటీ ఉంది. బ్యాటింగ్ అక్షర్ కు ప్లస్ కాగా.. సీనియర్ స్పిన్నర్ కోటాలో చాహల్‌కు కలిసి రావచ్చు. ఆసియాకప్‌నకు వీరిని సెలక్ట్ చేసినా.. వరల్డ్‌కప్‌నకు ఒకరే ఉండే అవకాశం కనిపిస్తుంది.
ఆసియాకప్ టీం నుంచే 15 మందిని ఎంపిక చేసినా.. మిగతా సభ్యులు నెట్ ప్రాక్టీస్ ఆటగాళ్లుగా టీం వెంటే ఉంచవచ్చు. ఐదుగురు బ్యాట్స్ మన్స్, ఇద్దరు కీపర్స్, నలుగురు చొప్పున పేసర్లు, స్పిన్నర్లతో కూడిన జట్టును ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఇందులోనే ఇద్దరు ఆల్‌రౌండర్లు కూడా ఉండనున్నారు. ఇద్దరు వికెట్ కీపర్లు బ్యాటింగ్ కూడా చేస్తారు. మొత్తంగా ఏడుగురు బ్యాట్స్ మన్స్ ఉండే అవకాశాలున్నాయి. వీరికి తోడు ఆల్‌రౌండర్లు ఉన్నారు.
వరల్డ్ కప్ కు ఎంపికయ్యే భారత జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజుర్వేంద్ర చాహల్, శార్దూల్ ఠాకూర్/సంజూ శాంసన్ ఉండనున్నారు. ఆసియా కప్‌నకు వీరితోపాటు ముఖేశ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ ఉంటారు.