
బిగ్ బాస్ 7 స్టార్ట్ అయ్యి రెండవ వారం కూడా ముగియబోతుంది.. గత సీజన్ లా కాకుండా ఈసారి ఆడియెన్స్ ను అలరించే విధంగా బిగ్ బాస్ ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈ సీజన్ కు మంచి టాక్ వస్తుంది.. సెప్టెంబర్ 3న స్టార్ట్ అయిన ఈ సీజన్ ఈసారి మరిన్ని ట్విస్టులతో ఆద్యంతం అలరించేందుకు బిగ్ బాస్ కొత్త కొత్త టాస్కులను ఇస్తున్నాడు.
ఇక మొదటి వారం ఎలిమినేషన్ లో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యింది. ఇక ఇప్పుడు రెండవ వారం ఎలిమినేషన్స్ కూడా ముగిసాయి.. రెండవ వారంలో 9 మంది నామినేట్ అయ్యారు. పల్లవి ప్రశాంత్, తేజ, శోభా శెట్టి, షకీలా, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, శివాజీ, అమర్ దీప్, ప్రిన్స్ యావర్ లు నామినేట్ అవ్వగా షకీలాను బయటకు పంపించారు..
నిన్న వీకెండ్ కావడంతో ఈమె ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటకు వచ్చింది. ఈమె ఎలిమినేట్ అయినప్పుడు నాగ్ తో ఇంత త్వరగా బయటకు వస్తానని అనుకోలేదని చెప్పి ఎమోషనల్ అయ్యింది.. ఇక బయటకు రాగానే ఈమె హౌస్ లో ఉన్న వారి గురించి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో ఈమె కొన్ని ఓపెన్ అయ్యింది.
యాంకర్ గా వ్యవహరిస్తున్న గీతూ రాయల్ అంతే బోల్డ్ గా షకీలాని నిలదీయగా ఈమె ఫైర్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళారా? ఆశ్రమానికి వెళ్ళారా? అంటూ నిలదీసింది. అంతేకాదు హౌస్ లో మీరు శివాజీ బ్యాచ్ నా లేదంటే సీరియల్స్ బ్యాచ్ నా అంటూ ప్రశ్నించారు. ఇక షకీలా కూడా ఒక్కొక్కరి గురించి చెప్పుకొచ్చింది.
పల్లవి ప్రశాంత్ బ్లడీ రాంగ్ యాటిట్యూడ్ తో ఉన్నాడని.. నాలుగు రోజుల్లోనే హౌస్ ను కాలు మీద కాలేసుకుని ఆడిస్తున్నాడని ఆరోపణలు చేస్తుంది.. ఆట సందీప్ ఉండాల్సిన కంటెస్టెంట్ అని శివాజీ నిజమైన బ్రదర్ అని రాతిక బ్యూటిఫుల్ స్నేక్ అని ఎవరితోనూ పెట్టుకోదని చెప్పింది. తాజాగా వచ్చిన ఈ ప్రోమో ఆకట్టుకుంటుంది.