39 C
India
Tuesday, May 12, 2026
More

    Shakila Remuneration : రోజుకు రూ. 4 లక్షలు సంపాదించిన షకీల.. ఆమె కారణంగానే మోసపోయిందా..!

    Date:

    Shakila Remuneration
    Shakila Remuneration

    Shakila Remuneration : 90వ దశకంలో బోల్డ్ బ్యూటీ షకీల గురించి ప్రస్తుతం యూత్ కు అంతగా తెలియకపోవచ్చు. కానీ, సోషల్ మీడియా విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చాక తెలుసుకుంటున్నారు అనడంలో సందేహం లేదు. అయితే సౌత్ లో స్టార్ హోదా సంపాదించిన ఈ శృంగార తార.. నార్త్ లో కూడా అదే గుర్తింపును మెయింటెన్ చేస్తూ వచ్చింది. బీ గ్రేడ్ మూవీస్ లో నటిస్తూ కూడా ఆమె చాలా పాపులారిటీ సంపాదించుకుంది. ఆ సమయంలో షకీల ఉందంటేనే భారీగా కలెక్షన్లు వచ్చేవంటే అతిశయోక్తి కాదు.

    సినిమాల్లో అవకాశాలు రాను రాను తగ్గిపోవడంతో తెరమరుగు అయ్యింది షకీల. కొన్ని రోజులు షోలలో కనిపించినా అక్కడా ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. దీంతో ఆమె చాలా కాలం తెర వెనకే ఉండిపోవాల్సి వచ్చింది. చాలా ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడు విజయ్ టీవీలో కూకు విత్ కోమలి అనే తమిళ రియాలిటీ షోతో బుల్లితెర నుంచి తన అభిమానులను మరోసారి పలకరించబోతున్నారు షకీల.  ప్రస్తుతం ఈ షోకు మంచి ఆదరణ కొనసాగుతోంది. ఈ షోకు సంబంధించిన నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తి కర విషయాలను వెల్లడించింది.

    90వ దశకంలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ తదితర ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన తార షకీల. ఆమె ఎలాంటి సినిమా తీసినా యూత్ ఎగబడేవారు. చాలా సినిమాలు షకీల ఇమేజ్ తోనే ఆడాయంటే సందేహం లేదు మరి. అంతగా నటిస్తూ కవ్విస్తూ కనిపించేది ఈ సుందరి. ఇక ఆమె మళయాలంలోని చేసిన బీ గ్రేడ్ సినిమాలు ఎక్కువగా తెలుగు, తమిళం ఇతర భాషల్లోకి డబ్ చేసేవారు. వీటికి ఆదరణ మరింత ఎక్కువగా ఉండేది. నిర్మాతలకు కాసుల వర్షం కురిసేది. దీంతో షకీల కూడా తన పారితోషికాన్ని పెంచుతూ వెళ్లింది.

    కార్లు, మేడల్లో విలాసవంతంగా జీవిస్తుంది షకీల అంటూ వస్తున్న వార్తలను ఆమె ఖండించింది. ‘కెరీర్ మొదట్లో బాగున్న మాట వాస్తవమే కానీ రాను రాను అవకాశాలు తగ్గాయి. దీంతో రాబడి లేదు. అప్పుడు చేసే పరిస్థితి ఎదురైంది. చివరికి ఉండేందుకు ఇల్లు కూడా లేకుండా పోయింది. తనకు ఎలాంటి బీఎండబ్ల్యూ కారు లేదు.. ఫ్లాట్లు లేవు. ప్రస్తుతం తానొక అద్దె ఇంట్లో ఉంటున్నాను. నా అనుకున్న వారే నన్ను మోసం చేశారు. ఐటీ దాడులు జరుగుతాయని చెప్పి నా సోదరే డబ్బు తీసుకుపోయింది. రోజూ రూ. 4 లక్షల ఆవరేజ్ గా సంపాదించే దాన్ని. ఇప్పుడు నాకు ఏదీ లేకుండా చేసింది’. అంటూ కన్నీటి పర్యంతమయ్యారు షకీల.

    మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిపై సంచలన వ్యాఖ్యలు చేశారు షకీల. ఆయనే తన సినిమాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అప్పట్లో తక్కువ బడ్జెట్ తో చేసిన తన సినిమాలు మమ్ముట్టి లాంటి స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడేవి. దీంతో వారు నా మీద కోపంగా ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత నా చిత్రాల రిలీజ్ ను అడ్డుకునేవారు అంటూ ఆరోపించారు. ఆమె శృంగార చిత్రాల ముందు ఎంతటి స్టార్ హీరోల సినిమాలైనా దిగదుడుపే మరి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Venu Madhav : వేణు మాధవ్ ఇలాంటి వ్యక్తి అనుకోలేదు.. షకీలా సంచలన కామెంట్స్

    Venu Madhav and Shakila : షకీలా ఒకప్పటి శృంగార తార...

    Shivaji Remuneration : రెమ్యునరేషన్ విషయంలో వెనక్కు తగ్గని శివాజీ.. ఎంత తీసుకున్నాడంటే?

    Shivaji Remuneration : రియాలిటీ షోలలో తెలుగు బిగ్ బాస్ కు...

    Bigg Boss Shakila : అందుకోసమే వచ్చారు.. షకీలా షాకింగ్ కామెంట్స్

    Bigg Boss Shakila : సెక్సీ క్వీన్ గా గుర్తింపు దక్కించుకున్న...

    Big Boss 7 : దమ్ము కొడుతూ కనిపించిన షకీలా.. ఓహో ఈ ఆప్షన్ కూడా ఉందా..?

    Big Boss 7 : బిగ్ బాస్ 7 స్టార్ట్ అయ్యి...