BJP Conspiracy :
బీజేపీ మాట విని ఉంటే తమ పార్టీ చీలిపోయేది కాదని ఎన్సీపీ నేత శరద్ పవార్ చెప్పడం సంచనలం రేపుతున్నది. శరద్ పవార్ వ్యాఖ్యలను చూస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రతిపక్ష పార్టీలను చీల్చేందుకు వెనకాడబోదని స్పష్టమవుతున్నది.
గత వారం మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిన విషయం తెలిసిందే. ఒక వర్గానికి చెందిన నాయకుడు శరద్ పవార్, ప్రస్తుతం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆయన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ వెంట మరికొంత మంది ఉన్నారు.
పార్టీ విచ్ఛిన్నం తర్వాత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.
తన పార్టీ చీలడానికి భారతీయ జనతా పార్టీయే కారణమని నిందించారు. నేను వారి (బీజేపీ) సలహాను అంగీకరించి ఉంటే పార్టీ చీలిపోయేది కాదన్నారు.
గత ఎన్నికల సమయంలో తమ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ ప్రయత్నించిందని కూడా పేర్కొన్నారు. కానీ భావజాలంలో విభేదాల కారణంగా పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు.
మూడుసార్లు పొత్తుకు యత్నం 2014, 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ పొత్తుపై చర్చలు జరిపింది. కానీ భావజాల విభేదాల కారణంగా శరద్ పవార్ అందుకు సమ్మతించ లేదు. తానెప్పుడూ బీజేపీతో కలిసి వెళ్లలేదని, భవిష్యత్తులో వారితో వెళ్లే అవకాశం ఇప్పటికీ, ఎప్పటికి ఉండదని మహారాష్ర్ట సీనియర్ నేత స్పష్టం చేశారు.
సొంత కూతురిని కాదని.. సోదరుడి కొడుకుకు ప్రాధాన్యం
శరద్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను 4 సార్లు ఉప ముఖ్యమంత్రిని చేశాడు.ప్రఫుల్ పటేల్ చేతిలో ఓడిపోయినా మంత్రిని చేశారు. యూపీఏ ప్రభుత్వంలో పీఏ సంగ్మా కూతురితో పాటు ఇతర నేతల వారసులు కేంద్ర మంత్రులయ్యారు.
కానీ శరద్ పవార్ సొంత కూతురు సుప్రియను మాత్రం మంత్రిని చేయలేదు. కానీ అజిత్ పవార్ కుటుంబ పాలనపై శరద్ పవార్ పై విరుచుకుపడడంపై విమర్శలు వస్తున్నాయి.
ఎన్సీపీ అధ్యక్షుడిగా శరద్ పవార్ నియామకం చట్టవిరుద్ధమైతే, ప్రఫుల్ పటేల్ వంటి వారి నియామకాలు చట్టవిరుద్ధమని శరద్ పవార్ అన్నారు. బీజేపీ చేతిలో అజిత్ పవార్ కీలుబొమ్మగా మారి విమర్శలు చేస్తున్నాడని రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
గతంలో శరద్ పవార్ ను రాష్ర్టపతి అభ్యర్థిగా ప్రకటిస్తామని బీజేపీ చేసిన ప్రతిపాదనను అప్పుడు తిరస్కరించారు. రిటైర్మెంట్ తీసుకోమని అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపైనా శరద్ పవార్ మండిపడ్డారు. రాజకీయాల్లో ఎవరూ పెద్దవారు కాదని శరద్ పవార్ అన్నారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రకటనను గుర్తు చేశారు. తనకు అలసట లేదు, రిటైర్ కూడా లేదన్నారు. తాను పార్టీ కోసం పనిచేస్తున్నానని, ఎలాంటి మంత్రి పదవి కూడా దక్కడం లేదని అన్నారు.
తనను విరమణ చేయమని చెప్పడానికి వారెవరు.. తనలో పనిచేసే సత్తా ఇంకా ఉందని గుర్తు చేశారు. తనకు వెన్నుపోట్లు కొత్త కాదని, గతంలోనూ ఎదుర్కొన్నానని చెప్పారు. పార్టీని తిరిగి నిలబెట్టుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.
ReplyForward
|