
Sharanya Nag : హిరోయిన్ శరణ్య అనగానే 10th క్లాస్ సినిమా గుర్తుకు వస్తుంది. అప్పట్లో ఆ సినిమాను ఎక్కువ మంది ఫ్యాన్స్ ఆదరించారు. సినిమా గురించి చాలా విమర్శలు వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ సక్సెస్ టాక్ అందుకుని ఘన విజయం సాధించింది. టెన్త్ క్లాస్ మూవీలో భరత్, శరణ్య సునయన ముఖ్య పాత్రలు పోషించారు. చందు దర్శకత్వం వహించగా.. సినిమా సూపర్ హిట్ అయింది.
టాలీవుడ్ లో 2000 సంవత్సరం నుంచి వరుసగా ప్రేమకథా చిత్రాలే హిట్ అయ్యాయి. నువ్వునేను, నువ్వే కావాలి, చిత్రం, నీ మనసు నాకు తెలుసు ఇలా కాలేజీ, స్కూల్, లవ్ స్టోరీస్ ఫుల్ సక్సెస్ సాధించాయి. ఇలాంటి కథాంశం తో వచ్చిన మూవీనే టెన్త్ క్లాస్. శరణ్య అంతకుముందు చైల్డ్ ఆర్టిస్టుగా నీ మనసు నాకు తెలుసు మూవీలో నటించింది.
ప్రేమిస్తే సినిమాలో ఐశ్వర్య పక్కన నటించిన శరణ్య.. టెన్త్ క్లాస్ మూవీలో మెయిన్ రోల్ చేసింది. తెలుగులో ప్రేమ ఒక మైకం, దూసుకెళ్తా లాంటి సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది. 2014 తర్వాత ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరమైంది. పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం గుర్తు పట్టలేనంత ముద్దుగా.. బొద్దుగా తయారైంది. బొద్దుగా మారిన శరణ్యను చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. శరణ్య ఏంటీ ఇంతలా లావు అయ్యావేంటి అని కామెంట్స్ చేస్తున్నారు. ఫిట్ నెస్ పై దృష్టి పెట్టడం లేదా అని అంటున్నారు.
ప్రేమిస్తే లో మంచి రోల్ చేసిన ఈ ముద్దుగమ్మకు వరుసగా అవకాశాలు వచ్చాయి. కానీ అవన్నీ పెద్ద హిట్ లు కాకపోవడంతో వెనుదిరిగి చూడాల్సి వచ్చింది. శరణ్య నాగ్ అనే ఇన్ స్టాగ్రాం ఐడీతో తన లేటెస్ట్ ఫిక్స్ ను అప్ లోడ్ చేస్తూ తను ఎలా ఉందో అభిమానులకు చూపిస్తూ ఉంటుంది. ఇంకా సినిమాల్లో నటించవచ్చుగా అనే ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుండగా.. ఆమె నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు.