
Sharwanand Marriage : యంగ్ హీరో శర్వానంద్ ఓ ఇంటి వాడు అయ్యాడు. నిన్న రాత్రి గుజరాత్ లోని లీలా ప్యాలెస్ లో రక్షిత రెడ్డి మెడలో ఆయన మూడు ముళ్లు వేశాడు. మాజీ మంత్రి గోపాల కృష్ణ మనవరాలు అయిన రక్షితరెడ్డితో శర్వానంద్ గత జనవరిలో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. రక్షితరెడ్డి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా చేస్తున్నారని సమాచారం.

లీలా ప్యాలెస్ లో రెండ్రోజుల పాటు శర్వానంద్ పెండ్లి అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఇక ఆయన అధికారికంగా పెండ్లి ఫొటోలు రివీల్ చేయకపోయినా.. అందులో కొన్ని మాత్రం బయటకు వచ్చాయి. ఈ ఫొటోలు చాటా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇవి చూసిన ఆయన ఫ్యాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త జంటకు అంతా కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక త్వరలోనే హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పెండ్లికి టాలీవుడ్ ప్రముఖులను పిలవలేదు కాబట్టి.. రిసెప్షన్ పార్టీలో అందరినీ ఆహ్వానించాలని శర్వానంద్ భావిస్తున్నారంట.






