
Spa Center : హైదరాబాద్ మహా నగరంలో చీకటి దందా పగలు కూడా జోరుగా కొనసాగుతూనే ఉంటుంది. స్పాసెంటర్ల ముసుగులో బాహాటంగానే వ్యాపారం చేస్తున్నారు కొందరు నిర్వాహకులు. బయటొక బోర్డు.. లోపలొక కథ. ఇదంతా ఇక్కడ కామనే. మోసపోయిన వాళ్లు ఫిర్యాదు చేసే వరకు వీటి నిర్వహణ గుట్టు చప్పుడు కాకుండా ఉంటుంది. ఇలాంటి ఘటనే ఇక్కడ జరిగింది. పైగా ఈ గలీజ్ దందా నిర్వహించేది ఎంబీబీఎస్ మధ్యలో ఆపేసిన విద్యార్థిని కావడం మరో విశేషం.
మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఒక స్పా సెంటర్‌పై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు నిర్వాహకులు, కొందరు యువతులు, మరికొంత మంది విటులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలం పట్టణానికి చెందిన రాయల శృతి అనే యువతి డాక్టర్ చదవాలి అనుకుంది. అందుకు ఉక్రెయిన్ కు వెళ్లింది. అక్కడ మెడిసిన్ సీట్ సంపాదించింది. మొదటి సంవత్సరం పూర్తిచేసి, రెండో సంవత్సరంలోకి వెళ్లాక ఫీజు తనకు భారంగా మారింది. దీంతో చేసేది లేక చదువు ఆపేసింది.
తన స్వంత గ్రామం భద్రాచలానికి వచ్చింది. కొన్ని రోజులు ఖాలీగా ఉన్న తర్వాత అమీర్‌పేటలో ఎయిర్ హోస్టెస్‌గా శిక్షణ తీసుకుంది. శిక్షణకు అయ్యే ఖర్చు కోసం బంజారా హిల్స్‌లోని ఓ స్టార్ హోటల్లో రిసెప్షనిస్ట్ గా కూడా ఉద్యోగం చేసింది. ఈ ఉద్యోగంలో వచ్చిన డబ్బు ఏ మాత్రం సరిపోకపోవడంతో శిక్షణను కూడా మధ్యలోనే ఆపివేసింది. డబ్బు లేకపోవడం వల్లే తన కల నెరవేరడం లేదని భావించింది. డాక్టర్, ఎయిర్ హోస్టెస్ కలలు తీరకపోవడంతో తేలిగ్గా డబ్బు ఎలా సంపాదించాలో ఆలోచించింది.
ఈ క్రమంలో హైదరాబాద్ బంజారా హిల్స్ ఓ అపార్ట్మెంట్లో పర్పుల్ నేచురల్ హెల్త్ త్రూ ఆయుర్వేద పేరుతో స్పా సెంటర్‌ను ఓపెన్ చేసింది. వివిధ ప్రాంతాల నుంచి యువతులను ఇక్కడికి తీసుకువచ్చి గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తుంది. ఈ నోటా ఆ నోటా విషయం పోలీసుల వరకు పాకింది. దీంతో దాడి చేసి పోలీసులు వారిని అరెస్ట్ చేసింది. నిర్వాహకురాలు శృతితో పాటు మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈమె గతంలో కూడా ఇలాంటి పనులే చేసి జైలుకు వెళ్లి వచ్చి మళ్లీ ఇవే పనులు చేసింది. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.