
ఇక్కడ మాత్రం గిరిగీసుకుని నటించిన ఈ ముద్దుగుమ్మ అక్కడ ఏ హద్దులు లేకుండా వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించింది. ఇటీవలే కర్దా అనే వెబ్ సిరీస్ లో నటించి మెప్పించిన ఈమె తన లవర్ విజయ్ వర్మతో కలిసి మొదటిసారి లస్ట్ స్టోరీస్ 2 అనే బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించింది. ఇది నిన్నటి నుండే స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ సందర్భంగా తమన్నా, విజయ్ ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.
మరి తాజా ఇంటర్వ్యూలో భాగంగా ఈమె తన ఫస్ట్ కిస్ గురించి ఓపెన్ గా చెప్పేసింది. లస్ట్ స్టోరీస్ 2 స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో ఈమె ఎన్నో సీక్రెట్స్ బయట పెడుతూ వచ్చింది.. ఇప్పటి వరకు ఈ భామకు ఒక ఇమేజ్ ఉండేది.. ఏ సినిమాలో లిప్ లాక్ చేయలేదు. ఎంత స్టార్ హీరో అయిన చెయ్యను అని రూల్ పెట్టింది. అయితే ఇప్పుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తుండడంతో ఇవన్నీ గాలికొదిలేసింది..
ఈ వెబ్ సిరీస్ లో కలిసి నటిస్తున్న సమయం లోనే వీరిద్దరూ ప్రేమించుకున్నారు. చట్టాపట్టాలేసుకుని మరీ తిరిగి వార్తల్లో నిలిచారు. మరి తాజాగా ఈ బ్యూటీ ప్రమోషన్స్ లో ఫస్ట్ డేట్ శృంగారం గురించి లేదు అని క్లారిటీ ఇవ్వగా ఇప్పుడు మొదటి లిప్ కిస్ పెట్టిన వ్యక్తి ఎవరు అనే ప్రశ్న ఎదురైంది. ఈ బ్యూటీ ఇందుకు సమాధానంగా సిగ్గుపడుతూ విజయ్ వర్మ పేరు చెప్పింది. అతనికే నేను నా లైఫ్ లో మొదటి లిప్ కిస్ ఇచ్చాను అంటూ చెప్పుకొచ్చింది.
ReplyForward
|