cancer : క్యాన్సర్ వచ్చిదంటే చాలు రోజులు లెక్కించుకోవాలి. అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నా మళ్లీ ఎప్పుడు తిరగబెడుతుందో చెప్పలేం. ఒక్కసారి ఒంట్లోకి ఈ వైరస్ చేరిందా చావు వరకు తీసుకెళ్తుంది. కానీ ఒక మహిళ క్యాన్సర్ కే వణుకు పుట్టించింది. వైద్యురాలైన సదరు మహిళ వ్యాధిని ఎదుర్కొన్న తీరుపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా దక్కుతున్నాయి. 53 ఏళ్ల పరిశోధకురాలు బీటా హలాస్సీ ఆమె అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ని ఉపయోగించి, కీమోథెరపీ లేకుండానే స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్‌కు చికిత్స చేసుకుంది. ఆమె ఆంకోలైటిక్ వైరోథెరపీ (OVT) విధానం ద్వారా చికిత్స తీసుకుంది. జాగ్రెబ్ విశ్వవిద్యాలయంలో వైరాలజిస్ట్ అయిన హాలాస్సీ, ఆమె అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ను చికిత్స కోసం ఉపయోగించుకుంది. దీనిని ఆంకోలైటిక్ వైరోథెరపీ (OVT) 2 అని పిలుస్తారు. ఈ విధానంలో క్యాన్సర్ కణాలపై దాడి చేసేందుకు శరీరంలోకి వైరస్ లను వదులుతారు. దీంతో రోగ నిరోధక శక్తి మేల్కొని క్యాన్సర్ వైరస్ లను సైతం చంపుతుంది. ఆమె కేసు క్యాన్సర్ చికిత్సలో OVT సామర్థ్యాన్ని చూపించింది. దాని భవిష్యత్ అనువర్తనాలు మరియు స్వీయ-నిర్వహణ ప్రయోగాత్మక చికిత్సల యొక్క నైతిక చిక్కుల గురించి చర్చలను రేకెత్తించింది.
cancer : సొంత వైద్యంతో క్యాన్సర్ నుంచి బయటపడింది..? స్టేజ్ 3లో ఉన్నా తరిమికొట్టింది..
Date: