
Boy friends : ఆమెకు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు ప్రియులు.. భర్త చనిపోవడంతో ఇక ముగ్గురితో రాసలీలలు మొదలుపెట్టింది. తనకు అడ్డూ అదుపు లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నది. చివరకు అక్రమ మద్యం వ్యాపారం కూడా మొదలు పెట్టింది. ఇక నెలకు లక్షల్లో డబ్బు..విలాసవంతమైన జీవితం.. ముగ్గురు ప్రియులతో ఎంజాయ్ మెంట్..అలా సాగిపోతున్నది.
కర్ణాటకలోని మైసూరు సమీపంలోని మలే మహదేశ్వర కొండ ఒక పుణ్యక్షేత్రం. అక్కడే హోసకోలాడ వీధిలో ఓ మహిళ మద్యం విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడింది. పక్కా సమాచారంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె పేరు పుట్టమ్మ అలియాస్ పుట్టీ ఆంటీగా గుర్తించారు. ఆమె వద్ద ఏకంగా 8 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే పుణ్యక్షేత్రంలో అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నదని స్థానికులు సమాచారం ఇవ్వడంతో పుట్టి అంటీని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాంతంలో జూదం, మద్యం వ్యాపారం జోరుగా జరుగుతుంటుందని తెలుస్తున్నది. ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. దాడులు చేశారు.
అయితే పుట్టి అంటీ జల్సాలకు అలవాటు పడి, ఇలా అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నదని పోలీసులు తెలిపారు. ఆమెకు ముగ్గురితో వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. అయితే ఆ ముగ్గురి సాయంతోనే ఈ వ్యాపారం చేస్తున్నదని తెలిపారు. త్వరలోనే వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. పుట్టి ఆంటీ రాసలీలల వ్యవహారం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. భర్త చనిపోవడంతో మరి ఇంత బరితెగించిందని స్థానికులు తిట్లదండకం మొదలుపెట్టారు. ఇటు పుణ్యక్షేత్రం లో అక్రమ మద్యం వ్యాపారం ఏంటని మండిపడుతున్నారు.






