
ఇంతకీ ఆ గొర్రెకు ఎందుకంత డిమాండ్? ఏంటి దాని ప్రత్యేకత అంటే దానికి ఉర్దూలో 786 అనే అక్షరాలు ఉన్నాయట. దీంతో అందరు దాన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. కొందరు ముస్లింలు చూసి దాన్ని అమ్మాలని కోరగా నిరాకరించాడు. రూ. కోటి ఇస్తామన్నా ససేమిరా అంటున్నాడు. గొర్రెకు కోటి పలకడమేమిటని అందరు ఆశ్చర్యపోతున్నారు.
రాజస్థాన్ లోని చురు జిల్లాలో రాజుసింగ్ అనే గొర్రెల కాపరి వద్ద ఈ గొర్రె ఉంది. గొర్రెకు ఏదో ఆకారం రావడం గమనించిన రాజుసింగ్ ఇదేమిటో అర్థం కాలేదు. తరువాత కొందరికి చూపించగా అవి ఉర్దూలో ఉండటంతో వారు గొర్రెను తమకు అమ్మాలని పట్టుబట్టినా ఇవ్వడం లేదు. దేవుడి ఆశీస్సులతోనే గొర్రెకు అంతటి డిమాండ్ వచ్చిందని చెబుతున్నాడు.
ఎంత మంది వచ్చి అడిగినా దాన్ని మాత్రం ఇవ్వడం లేదు. దీంతో ఈ వార్త అక్కడ దావానంలా వ్యాపించింది. దాన్ని చూసేందుకు తండోపతండాలుగా వస్తున్నారు. దేవుడి అక్షరాలు ఉంచుకున్న గొర్రెను చూసేందుకు చాలా మంది క్యూ కడుతున్నారు. గొర్రెది ఎంత అదృష్టమో కదా. మనుషులకు రాని గుర్తింపు గొర్రెకు రావడం నిజంగా ఆశ్చర్యమే. ఇంకా దాన్ని యజమాని అమ్మకపోవడం కూడా విడ్డూరమే.
ReplyForward
|