Shilpa Shetty : ఒకప్పటి హీరోయిన్ శిల్పాశెట్టి. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో తన టాలెంట్ చూపించింది. మంచి పారితోషికం అందుకుంది. స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ఆమె రాజ్ కుంద్రాను వివాహం చేసుకుంది. తరువాత అతడు పోర్న్ వీడియోల కేసులో జైలు జీవితం అనుభవిస్తున్నాడు. బాలీవుడ్ లో అగ్రహీరోయిన్ గా కొనసాగింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రియాలిటీ షో గా బిజీగా మారిపోయింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేస్తూ ఆకట్టుకుంటోంది. శిల్పాశెట్టి పోస్టు చేసిన ఒక ఫొటో అందరిని ఆకట్టుకుంటోంది. తన గ్లామర్ తో ఫిదా చేస్తోంది. మోడల్ గా తన కెరీర్ ప్రారంభించిన ఆమె సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. 1993లో మొదటి అవకాశం వచ్చింది. బాజీగర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
తెలుగులో 1996లో సాహసవీరుడు సాగరకన్య సినిమాలో అవకాశం దక్కించుకుంది. మోహన్ బాబుతో వీడెవడండీ బాబూ లో నటించింది. బాలకృష్ణతో భలే వాడివి బాసులో కనిపించింది. నాగార్జునతో ఆజాద్ లో జత కట్టింది. హిందీ, కన్నడ చిత్రాల్లో కూడా తనదైన ముద్ర వేసింది. బాలీవుడ్ నటీమణులలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా గుర్తింపు పొందింది.
2005 తరువాత తన కెరీర్ డౌన్ అయింది. రియాల్టీ షోలు, సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటోంది. సోషల్ మీడియాలో తన ఫొటోలు పెట్టి వైరల్ చేస్తోంది. 47 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోయిన్ మాదిరి గ్లామర్ ప్రదర్శిస్తోంది. దీంతో ఆమె ఫొటోలు చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తరగని అందంతో శిల్పాశెట్టి దూసుకుపోతోంది.