
Shiva Balaji Madhumita : తక్కువ సినిమాలే చేసినా ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకున్నారు శివబాలాజీ. ఇక మధుమిత విషయానికి వస్తే ఇటు తెలుగు ఇండస్ట్రీతో పాటు అటు తమిళ ఇండస్ట్రీలో కూడా చక్కగా రాణించారు. తెలుగులో ఆమె చేసిన సినిమాలు బాగా హైప్ ను దక్కించుకున్నాయి. ఒకటి రెండు సినిమాల్లో హీరోయిగా నటించినా అవి కలిసి రాలేదు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చిన సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. అర్జున్, మీనా జంటగా నటించిన సినిమా ‘పుట్టింటికీ రావే చెల్లి’. ఇందులో మధుమిత మేయిన్ రోల్ వేసింది. ఆ సినిమాలో ఆమె చేసిన పాత్ర తెలుగు వారిని బాగా ఆకట్టుకుంది.
శివబాలాజీని పెళ్లి చేసుకుంది మధుమిత. టాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న వీరు ‘ఇంగ్లిష్ కారన్’ సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరి మధ్యలో ప్రేమ పుట్టిందట. ఒక ఇంటర్వ్యూలో ఈ జంట తమ జీవితంలోని జరిగిన ఘట్టాలను వివరించారు. అయితే శివబాలాజీ లవ్ చేస్తున్నానని ప్రపోజ్ చేయకుండా ఏకంగా పెళ్లి చేసుకుందాం అంటూ ప్రపోజ్ చేశాడట. శివబాలాజీ ప్రపోజ్ చేసిన తర్వాత దాదాపు సంవత్సరం పాటు పెళ్లి కోసం వెయిట్ చేశారట. జాతకాలలో దోషం ఉందని, పూజలు చేస్తే పోతుందని యాడాది పడుతుందని చెప్పడంతో వేయిట్ చేశారట. ఆ తర్వాత వీరి పెళ్లి జరిగి ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చారు.
ఈ జంట ఎదుర్కొన్న ట్విస్ట్ లు, టర్న్స్ ను అభిమానులకు వివరించారు. మధుమిత మాట్లాడుతూ ‘ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ’ సినిమాలో శివబాలాజీని మొదటి సారి చూశాను అప్పుడే నచ్చాడు. ఇంగ్లిష్ కరన్ సమయంలో దర్శకుడితో మళ్లీ పరిచయం పెంచుకున్నాను. చాలా సార్లు నాకు హెల్ప్ చేశాడు. దీంతో మంచివాడనే ఫీలింగ్ కలిగింది. మొదట్లో తనను బాగా గమనించేవాడట. నేను లిప్‌స్టిక్ పెట్టుకున్నాక తుడుచుకున్న టిష్యూ పేపర్ ను కూడా దాచుకున్నారట. ఒక సారి చెన్నై వెళ్లిన సందర్భంలో మిస్సవుతున్నానని మెజేస్ పెట్టాడు. దీంతో కొంచెం అనుమానం వచ్చి దూరం పెట్టాను. ఆ తర్వాత దగ్గరయ్యేందుకు చాలా ట్రై చేశాడు. సడన్ గా ఒకసారి వచ్చి పెళ్లి చేసుకుందాం అంటూ ప్రపోజ్ చేశాడు. ఇక తప్పలేదు. కట్ చేస్తే ఇప్పుడు ఇద్దరు కొడుకులతో జీవితం సాఫీగా సాగిపోతుంది’ అంటూ చెప్పింది మధుమిత.
ReplyForward
|