AP CPS Employees : ఏపీ కంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగుల అసోసియేషన్ ఆదివారం ఛలో విజయవాడ ఆందోళనను నిర్వహించబోతోన్న నేపథ్యంలో విజయవాడ పోలీసులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ ఆందోళనకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఈ మేరకు విజయవాడ నగర పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఏపీ సీపీఎస్ ఉద్యోగ సంఘాలు నిర్వహించ తలపెట్టిన ఛలో విజయవాడ అనుమతులు లేవని పోలీసులు తెలిపారు. ఇటువంటి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు స్థానిక పోలీస్ అధికారుల నుంచి గానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవని వివరించారు. ప్రస్తుతం నగరంలో 144 సెక్షన్ సీఆర్పీసీ, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని గుర్తు చేశారు.