
mangoes eat : పండ్లలో రారాజు మామిడి. వాటిని చూస్తేనే తినేయాలనిపిస్తుంది. అంత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. దీంతో వాటిని తినడం వల్ల ప్రొటీన్లు, మినరల్స్, పోషకాలు అందుతాయి. సీజనల్ గా దొరికే పండ్లు కావడంతో అందరు తింటుంటారు. వాటిని తినడంతో జిహ్వ చాపల్యం తీరుతుంది. నోరూరుంచే మామిడి పండ్లంటే అందరికి ఇష్టమే. అందుకే కిలోల కొద్ది తీసుకువెళతారు.
మామిడి పండ్లు తినే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని నీళ్లలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల వాటిపై ఏవైనా రసాయనాలు ఉంటే తొలగిపోతాయి. ఇంకా ఏవైనా దెబ్బలు ఉన్నా నీళ్లలో కరిగిపోతాయి. ఇలా మామిడి పండ్లను ఎప్పుడు కూడా నానబెట్టకుండా తినడం మంచిది కాదు. ఈ నేపథ్యంలో వాటిని తినేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు వస్తాయి.
మామిడి పండ్లు కొనేటప్పుడు కూడా అవి మంచివో కావో గుర్తించాలి. మామిడి పండ్లకు పచ్చ, తెల్లని మచ్చలు ఉంటే అవి మంచివి కావని తెలుసుకోవాలి. రసాయనాలు వేసి పండించినవి చిన్నగా ఉంటాయి. సహజంగా పండినవి పెద్దగా ఉంటాయి. వాటిని ఒత్తి చూస్తే కూడా వాటి సహజగుణం బయట పడుతుంది. ఇలా మనం మామిడి పండ్లు కొనే ముందు శ్రద్ధగా పరీక్షించాలి.
మామిడి పండ్ల విషయంలో ఏమరుపాటుగా ఉండొద్దు. తాజా పండ్లు కొనుక్కుంటేనే మనకు మంచిది. ఆరోగ్యానికి ఇబ్బందులు రావు. అంతేకాని ఏవి పడితే అవి కొనుక్కుంటే ఆరోగ్యానికి హాని కలగొచ్చు. ఇలా మామిడి పండ్లు తాజాగా ఉన్నవి మాత్రమే కొనుక్కోవాలి. లేదంటే సమస్యలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. ఏది ఏమైనా మామిడి పండ్లు విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది.