
Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్ సినిమా కోసం మహేష్ బాబుతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. కానీ ఈ కాంబినేషన్ ఫైనల్ అయ్యేలోపే, ‘RRR’ తర్వాత హీరో సూర్యతో ఓ సినిమా చేయాలనుకున్నట్టు సమాచారం. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు వర్కౌట్ కాలేదు. దీంతో వెంటనే మహేష్ బాబుతో సినిమాకు కమిట్ అయ్యాడు రాజమౌళి. ఈ సినిమా కోసం ఆయన సుమారు 20 ఏళ్లుగా ప్లాన్ చేస్తున్నాడంటే, ఈ ప్రాజెక్టుపై ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి కాగా, 2027 మార్చిలో విడుదల లక్ష్యంగా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. రాజమౌళి–మహేష్ కాంబో ఇండియన్ సినిమా హిస్టరీలో మరో మైలురాయిగా నిలవబోతోందని అభిమానులు విశ్వాసంగా ఎదురుచూస్తున్నారు.