
Running AC : ఎండాకాలంలో వేడి అధికంగా ఉంటుంది. దీంతో మనం ఇంట్లో ఉన్నంత సేపు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు వేసుకుంటూనే ఉంటాం. అయినా వేడి తగ్గడం లేదు. ఉష్ణోగ్రత 40 డిగ్రీల పైనే నమోదవుతోంది. దేశవ్యాప్తంగా ఎండలు ముదిరాయి. ఎండ దెబ్బకు జనం భయపడుతున్నారు. ఉదయం పది అయిందంటే చాలు కాలు బయట పెట్టడం లేదు. సాయంత్రం మూడు గంటల వరకు ఎండ తాపం ఎక్కువగానే ఉంటోంది.
దీంతో ఓ పక్క ఏసీ వేస్తూనే మరో పక్క ఫ్యాన్ కూడా వేస్తున్నారు. రెండు వేస్తే కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందని అందరు భయపడుతుంటారు. కానీ రెండు వేస్తేనే బిల్లు తక్కువగా వస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. అందుకే బిల్లుకు భయపడి అయితే కూలరో లేకపోతే ఫ్యానో వేసుకుంటారు. రెండు వేస్తే బిల్లు వస్తుందని ఆందోళన చెందుతుంటారు.
కానీ ఏసీ, ఫ్యాన్ రెండు వేసుకుంటేనే ఉపశమనం ఉంటుంది. ఏసీ 24 వరకు ఉంచుకోవాలి. ఫ్యాన్ రెండు లేదా మూడో పాయింట్ మీద పెట్టుకుంటే గది చల్లగా మారుతుంది. దీంతో బిల్లు కూడా ఆదా అవుతుంది. ఈ టెక్నిక్ ఎవరికి తెలియక ఏదో ఒకటి వేసుకుంటారు. కానీ రెండు వేసుకుని సేద తీరితేనే గది చల్లగా మారుతుంది. మనకు కూడా హాయిగా ఉంటుంది.
ఇప్పటికైనా అందరు దీని విషయంలో నిజాలు తెలుసుకుని ఏసీ, ఫ్యాన్ రెండు నడిచేలా చూసుకోవాలి. కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందనే అపోహ నుంచి బయటకు రావాలి. ఇల్లు చల్లగా ఉండేలా జాగ్రత్తలు తీసుకునే క్రమంలో రెండింటిని వాడుకుని సేద తీరాలి. రెండింటిని వాడుకోవడం వల్ల కలిగే లాభాలను తెలుసుకుని మసలుకుంటే మనకు నష్టమే ఉండదు.