AAA అనేది USAలో ఆంధ్రప్రదేశ్ వారితో ఏర్పడిన మొదటి మరియు ఏకైక జాతీయ స్థాయి సంస్థ. దీని ఆధ్వర్యంలో న్యూ జర్సీలో ‘శ్రావణ మహోత్సవాలు’ నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని మొదటి సారి న్యూ జర్సీకి పరిచయం చేయబోతోంది ఈ సంస్థ. 2 సెప్టెంబర్, 2023 (శనివారం) పూజలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. 500 ఎలిజబెత్ ఏవ్, సోమర్ సెట్, న్యూ జెర్సీ-08873 (ఫ్రాంక్లిన్ హై స్కూల్)లో వేడుకలు నిర్వహించనున్నారు. ఇందులో మణిశర్మ మ్యూజికల్ కాన్సర్ట్ ను కూడా ఏర్పాటు చేశారు నిర్వాహకులు. వాగ్దేవి, వైష్ణవి, శృతిక, స్వరాగ్ కీర్తన్, పవన్ చంద్రన్ లాంటి యంగ్ సింగర్లు ఇందులో తమ గాత్రాన్ని వినిపించనున్నారు.
ఎంట్రీకి ఎలాంటి ఫీజు లేదని, 3.30 గంటలకు సామూహిక వరలక్ష్మీ కుంకుమపూజ, 4.30 ఆంధ్రప్రదేశ్ పిండివంటలు, 5 గంటలకు సంస్కృతిక కార్యక్రమాలు, 6.30 గంటలకు ఆంధ్రభోజనం కూడా ఉంటుంది. అందరూ కార్యక్రమానికి తరలిరావాలని ఒక వీడితో పాటు డిజిటల్ కరపత్రాలను సోషల్ మీడియా ద్వారా పంపించారు. AAA కు ఫౌండర్ గా హరి ముత్తుపల్లి, అధ్యక్షుడిగా గిరీష్ ఇయ్యపు, న్యూజర్సీ ప్రెసిడెంట్ గా సత్య విజ్జు, న్యూ జర్సీ స్టేట్ ఇంచార్జులుగా కళ్యాణ్ కర్రీ, కళ్యాణ్ విజయ్ లక్ష్మీశెట్టి వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు ఇంకా చాలా మంది ఈ సంస్థలో పని చేస్తున్నారు.