
Shriya Reddy : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సలార్ చిత్రం రూపొందిస్తున్నారు. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాతో సినిమా పరిశ్రమను ఓ ఊపు ఊపాడు. దీంతో ప్రభాస్ అతడితో కలిసి సలార్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో శృతిహాసన్ హారోయిన్ గా నటిస్తోంది. ఇందులో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ ఓ పాత్రలో నటిస్తున్నాడు. పొగరు సినిమాలో నటించిన శ్రీయా రెడ్డి కూడా ఓ పాత్ర చేస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సలార్ మూవీపై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రశాంత్ నీల్ సలార్ కోసం ఓ ప్రపంచమే నిర్మిస్తున్నాడని చెబుతోంది. దీంతో సినిమాపై అంచనాలు మరింత హైప్ గా మారాయి. ఇందులో ప్రభాస్ కోసం ప్రత్యేకంగా కొన్ని సన్నివేశాలు పెడుతున్నాడు. ఇంతవరకు ప్రభాస్ పోషించిన పాత్రలకు భిన్నంగా కనిపిస్తాడు.
సినిమాలో ప్రభాస్ కనిపించగానే ప్రేక్షకులు ఈలలు వేసి గోలలు చేస్తారు. సినిమాలో ప్రభాస్ కు అంతటి మహత్తర శక్తి ఉన్న పాత్రను క్రియేట్ చేశాడు. సినిమాలో ప్రతి సన్నివేషం ఆకట్టుకుంటుంది. శ్రీయారెడ్డి చేసిన కామెంట్స్ తో సలార్ మూవీపై అందరికి ఉత్కంఠ నెలకొంది. కేజీఎఫ్ ను మించి ఉంటుందని చెబుతోంది. దీంతో ప్రభాస్ స్టార్ తిరనుందని అంటున్నారు.
సలార్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 28న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి 100 రోజుల సమయం ఉండటంతో పోస్టర్ విడుదల చేశారు. ప్రభాస్ సినిమా విషయంలో అంచనాలు భారీగా ఉండటంతో ఏం చేస్తుందోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది. గత చిత్రాలు ప్రభాస్ కు హిట్ ఇవ్వకపోవడంతో ఈ సినిమాపైనే ప్రభాస్ కు ఆశలు ఉన్నాయి.






