
Shriya Saran’s spicy Look :
తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు శ్రీయా శరణ్. కెరీర్ ప్రారంభంలోనే స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ చిన్నది అనతి కాలంలో ఇండియన్ ఇండస్ట్రీలో తన ముద్రను వేసుకుంది. రజనీకాంత్, చిరంజీవి లాంటి వారితో పాటు ఆయా ఇండస్ట్రీలలో స్టార్ హీరోలతో నటించి మెప్పించింది శ్రీయ. దాదాపు 22 సంవత్సరాలు సినీ కళామతల్లికి సేవలు చేసింది.
రామోజీరావు బ్యానర్ ‘ఉషా కిరణ్ మూవీస్’ లో ఇష్టం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంటరైంది శ్రీయ. అక్కడి నుంచి ఆమెను నటనా ప్రస్తానం కొనసాగుతూనే ఉంది. బీజీ స్టార్ అయ్యింది. స్టార్ హీరోలతో పాటు స్టార్ డైరెక్టర్లు ఆమె డేట్స్ కోసం చూసేవారంటే అతిశయోక్తి కాదు. ఆమె నటనలో తీసుకున్న శిక్షణనే ఆమె కెరీర్ లో వెనక్కు తిరిగి చూసుకోకుండా చేయగలిగింది.
ఇష్టం తర్వాత సంతోషంలో నటించింది. సెకండ్ హీరోయిన్ అయినా. లీడ్ రోల్ ప్లే చేస్తూ కథ అంతా తన చుట్టే తిప్పుకుంటూ చక్కటి అభినయం, అందంతో తెలుగువారి దృష్టి మరల్చకుండా చేసుకుంది. ఇందులో నాగార్జునతో చేసిన ముద్దుగుమ్మ తర్వాత బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేశ్ లాంటి వారితోనే కాకుండా యంగ్ హీరోలైన ఎన్టీఆర్ లాంటి వారితో కూడా జతకట్టింది.
యంగ్ హీరోయిన్లు రావడం, కావాల్సినంత గ్లామర్ చూపుతుండడంతో ఆమెకు అవకాశాలు కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చాయి. ఈ సమయంలోనే బిజినెస్ మ్యాన్ అయిన ఆండ్రీ కోషీవ్ తో లవ్ ట్రాక్ మొదలు పెట్టింది శ్రీయ. కొంతం కాలం డేటింగ్ తర్వాత 2018లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. 2021లో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో సోషల్ మీడియాలోనే తన ఆనందాన్ని పంచుకుంది శ్రీయ.
దాదాపు 25 సంవత్సరాల సుధీర్ఘ కెరియర్ లో ఎన్నో ఎత్తు పళ్లాలను చూసింది శ్రీయ. కొన్ని సినిమాలు ఫ్లాప్ కాగా, మరికొన్ని బ్లాక్ బస్టర్ హిట్లు దక్కించుకున్నాయి. తన చివరిగా తీసిన గమనం, ఆర్ఆర్ఆర్ లోని పాత్రలు పెద్దగా బ్రేక్ ఇవ్వలేకపోయాయి. కానీ ‘దృశ్యం-2’ మాత్రం భారీ సక్సెస్ ఇచ్చింది. రీసెంట్ గా ఉపేంద్రతో వచ్చిన ‘కబ్జా’ కూడా నిరాశే మిగిల్చింది. కబ్జా తర్వాత ‘మ్యూజిక్ స్కూల్’తో ప్రేక్షకులను పలకరించింది ఈ బ్యూటీ.
సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో కూడా తెగ సందడి చేస్తుంది శ్రీయ. ఎప్పటికప్పుడు గ్లామర్ షోలు చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. తాజాగా ఇన్ స్టాలో పెట్టిన పిక్ లు కుర్రకారును తెగ ఊరించేస్తున్నాయి. కొడుకు పుట్టినా కూడా అందంలో ఏమాత్రం తగ్గలేదని కామెంట్లు కూడా పడుతున్నాయి.