
Suman Bose Press Meet :
‘స్కిల్ డెవలప్‌మెంట్’ కేసులో చంద్రబాబు నాయుడి అరెస్ట్ పై చాలా వరకు వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. చంద్రబాబు సాధారణ వ్యక్తి కాదు. ఇండియాలోనే కాకుండా దేశ వ్యాప్తంగా అంతెందుకు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను సుధీర్ఘ కాలం ఏలిన నాయకుడు చంద్రబాబు నాయుడు.
రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతిని రాజధానిగా చేసి ఏపీ డెవలప్‌మెంట్ కోసం ఎన్నో కంపెనీలను తెచ్చారు. దీనితో పాటు అమరావతికి భూములు ఇవ్వాలని రైతులను కోరి దేశం గర్వించేలా రాజధాని ఏర్పాటు చేయాలని కలలు కన్న నేత చంద్రబాబు నాయుడు. ఇటు రైతులకు కలిసి రావడంతో తర్వాత యువతకు ఉద్యోగాలు రావాలని వందలాది కంపెనీలను అమరావతికి పట్టుకొని వచ్చారు ఆయన.
స్కిల్ డెవలప్‌మెంట్ ఏర్పాటు చేస్తే యువతకు మరింత లబ్ధి చేకూరుతుందని పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకానికి కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. తర్వాత అసెంబ్లీలో కూడా చర్చ జరిగిన తర్వాత నిధులు విడుదల చేశారు. అయితే ఈ నిధులు దారి మళ్లినట్లు వచ్చిన ఆరోపణలతో చంద్రబాబును అరెస్ట్ చేశారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ ట్విటర్ వేదికగా స్పందించారు. అసలు ఇందులో ఎలాంటి స్కాం జరగలేదన్నారు. ప్రతీ కంపెనీ మార్కెట్లో వారి ఉత్పత్తుల డిమాండ్ పెంచుకునేందుకు పెట్టుబడి పెడుతుంది. మార్కెటింగ్ లో ఇదొక భాగం అని సుమన్ బోస్ అన్నారు. రిటైర్డ్ ఉద్యోగి పీవీ రమేశ్ ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేశారన్న వైసీపీ ప్రభుత్వం తర్వాత స్టాండ్ మార్చింది. ఇదంతా చూస్తే చంద్రబాబు ఎలాంటి స్కాం చేయలేదనిపిస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి.
What do you say about Vision of @ncbn garu?
Amazing !! Being a Chiefminister he articulated about how he wanted to translate & build the industrial infrastructure including soft skills of the Youth to get back investments into the state..which is enthralling !! #IAmWithBabu pic.twitter.com/724KhoMQOi
— iTDP Official (@iTDP_Official) September 17, 2023