- స్పందించని వైసీపీ, టీడీపీ, జనసేన
Silence in AP, TDP-YSRCP-Janasena
Silence in AP on Karnataka result : కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయం సాధించి నాలుగు రోజులవుతున్నా ఏపీలో ఏ ఒక్క పార్టీ నేతలు కూడా దీనిపై మాట్లాడడం లేదు. ఎంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందనా స్పందిస్తే ఎలాంటి ఉపద్రవం వచ్చి పడుతుందోనని భయపడుతున్నారా.. లేదంటే రేపటి పరిస్థితులు ఎలా ఉంటాయని భావిస్తున్నారా అనేది తేలడం లేదు.
అధికార వైసీపీ నుంచి నో కామెంట్..
అధికార వైసీపీ కూడా కాంగ్రెస్ విజయంపై ఒక్క మాట మాట్లడడం లేదు. పొరుగున ఉన్న రాష్ర్టంలో అంత పెద్ద ఎన్నికలు జరిగి, కాంగ్రెస్ విజయం సాధిస్తే కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తమకు చేటు చేస్తుందని భావిస్తుందా.. లేకుంటే ఇప్పటివరకు కేంద్రంలోని పెద్దలతో ఉన్న బంధాలు తెగిపోతాయని భావిస్తుందా అనేది చర్చనీయాంశం. సీఎం జగన్ తో సహా ఏ ఒక్క నేత కూడా కర్ణాటక ఫలితాలపై మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు.
టీడీపీ, జనసేనలది అదే తీరు..
మరోవైపు గత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తో కలిసి ప్రచారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నోరు మెదపలేదు. ప్రస్తుతం రాష్ర్టంలో తమ పార్టీ పరిస్థితే బాగాలేదు. ఇప్పుడు కేంద్రంతో గొక్కుంటే మొదటికే మోసం వస్తుందని భావించి సైలెంట్ అయ్యారని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. మరోపైపు 2024 ఎన్నికల్లో బీజేపీ తో కలిసి వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే పొత్తుల అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి.
బీజేపీ కూడా చంద్రబాబుపై నమ్మకం లేకున్నా, రాష్ర్ట ప్రయోజనాల దృష్ట్యా ఆయనను చేరదీసేందుకు ప్రయత్నిస్తు్న్నది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మిన్నుకుండి పోయారని సమాచారం. మరోవైపు బీజేపీతో సత్సంబంధాలు, అలయెన్స్ ఖాయం చేసుకున్న జనసేనాని కూడా కాంగ్రెస్ గెలుపుపై స్పందించలేదు. ప్రస్తుత తరుణంలో ఇది మంచిది కాదని ఆయన భావించి ఉంటారని తెలుస్తున్నది. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని అంతా అంటుంటారు. అగ్రనేతలంతా అన్ని పార్టీలతో సత్సంబంధాలే ఉన్నా కొన్ని కారణాల రీత్యా సైలెంట్ గా ఉండి ఉంటారని టాక్ వినిపిస్తున్నది.