
Singapore : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్‌లో గాయపడిన విషయం తెలిసిందే. సింగపూర్‌లో ఏప్రిల్ 8న జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్‌తో పాటు మరో 14 మంది పిల్లలు గాయపడ్డారు. అయితే, అప్రమత్తంగా స్పందించిన నలుగురు భారతీయ వలస కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి పిల్లలను కాపాడారు. ఈ ధైర్యానికి గుర్తింపుగా సింగపూర్ ప్రభుత్వం వారిని సత్కరించింది. ప్రమాదం నుంచి మార్క్ పూర్తిగా కోలుకొని ఇంటికి చేరగా, మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.