Singapoore passport ఒక దేశ పౌరులు మరో దేశంలోకి వెళ్లేందుకు ఉపయోగించేవి పాస్ పోర్ట్. అయితే ఇవి ఆయా దేశాల మధ్య ఉండే అవసరాలు, వ్యవహారాలతో ముడిపడి ఉంటాయి. ఇప్పటి వరకు సింగపూర్ కు చెందిన పాస్ పోర్ట్ ప్రపంచలోని పవర్ ఫుల్ పాస్ పోర్ట్ గా గుర్తింపును దక్కించుకుంది. ఈ పాస్ పోర్ట్ ఉంటే చాలు ఇక వీసా తీసుకొని 192 దేశాలకు వెళ్లచ్చట అందుకే దీనిని పవర్ ఫుల్ పాస్ పోర్ట్ అంటున్నారు.
ప్రపంచలోని ఏ దేశం పాస్ట్ పోర్ట్ పవర్ ఫుల్ అంటూ నిర్వహించిన ఒక సర్వేలో సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచంలో 227 దేశాలు ఉంటే ఈ సింగపూర్ పాస్ పోర్ట్ పై 192 దేశాల్లో విహరించవచ్చు అని హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ సంస్థ వెల్లడించింది. ఇక తర్వాతి స్థానాల్లో జర్మనీ, ఇటలీ, స్పెయిన్ నిలిచాయి. అయితే, గత ఐదేళ్లుగా ఫస్ట్ ప్లేస్ లో ఉన్న జపాన్ పాస్ పోర్ట్ 3వ స్థానానికి పడిపోయింది. ఈ లిస్ట్ లో ఇండియా 80వ స్థానంలో నిలిచింది. ఇండియా పాస్ పోర్ట్ ఉంటే కేవలం 57 దేశాలు మాత్రమే తిరిగి రావచ్చు.
సింగపూర్ పాస్ పోర్ట్ తో పాటు సింగపూర్ ఎయిర్ పోర్ట్ కు కూడా చాలా గుర్తింపు ఉంది. విమానయాన సేవల్లో సింగపూర్ బెస్ట్ ప్లేస్ లో నిలుస్తుందని గతంలో చాలా నివేదికలు వెలువడ్డాయి. ఏది ఏమైనా ఒక్క సింగపూర్ పాస్ట్ పోర్ట్ ఉంటే చాలు ప్రపంచంలోని చాలా వరకు దేశాల్లో సంచరించవచ్చు.