Singer Chinmayi సింగర్ శ్రీపాద చిన్మయి.. ఈమె అందరికి సుపరిచితమే.. సింగర్ గా.. డబ్బింగ్ ఆర్టిస్టుగా.. ఎన్నో చిత్రాలకు పని చేసిన ఈమె మీటూ ఉద్యమంలో భాగంగా మరింత ఫేమ్ తెచ్చుకుంది. ఈమె మొదటి నుండి మహిళల విషయంలో న్యాయం అడగడానికి ముందు ఉంటుంది.. మీటూ ఉద్యమంలో భాగంగా ఈమె చేసిన కామెంట్స్ తో ఈమె మరింత పాపులర్ అయ్యింది..
మీటూ ఉద్యమంలో భాగంగా ఈమె అప్పట్లో తమిళ్ పాటల రచయిత వైరముత్తు మీద అనేక ఆరోపణలు చేసింది. ఈమె చేసిన ఆరోపణలు అప్పట్లో వైరల్ అయ్యాయి.. అక్కడ చిత్ర పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీయగా చిన్మయిని అక్కడ ఇండస్ట్రీ బ్యాన్ చేసింది. అయినా ఈమె స్ట్రాంగ్ గా నిలబడింది..
తమిళ్ ఇండస్ట్రీలో ఎంతో మందిపై ఆరోపణ చేసింది.. అయితే చిన్మయి 2022లో చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.. అందులో భాగంగా ఈమె మాట్లాడుతూ.. ”సింగర్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక గొప్ప ప్లే బ్యాక్ సింగర్ ను కలిసాను.. అతడికి నేను పెద్ద ఫ్యాన్.. అయితే ఒకసారి స్కైప్ లో మాట్లాడమని అడగడంతో చాలా ఆనందం వేసింది..
నా స్కైప్ ఐడి నుండి వీడియో కాల్ మాట్లాడాను.. ఆ వీడియో కాల్ లో ఆయన మాటలు విని అప్పటి వరకు ఉన్న గౌరవం కూడా పోయింది.. కాల్ లో బట్టలు మొత్తం విప్పేసి న్యూడ్ గా మాట్లాడమని అడిగాడు.. నేను షాక్ అయ్యాను.. చాలా కోపం వచ్చింది.. నేను అలా చేయనని చెప్పా.. బయట చెప్తానని భయం లేదా అని నేను అడిగితే బయట చెప్పిన ఎవ్వరూ నమ్మరు.. నా గుర్తింపు అలాంటిది అని చెప్పాడు.. అప్పట్నుండి నేను ఆయనను కలవలేదంటూ ఈమె చెప్పుకొచ్చింది..