
Siraj New Home : ఐపీఎల్-2023లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ సిరాజ్ హైమద్. ఆయన కొత్త ఇంటినిన ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఆర్సీబీ టీం సందర్శించింది. ఇటీవల జట్టు హైదరాబాద్ కు వచ్చింది. గురువారం (మే 18) రోజున సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ నేపథ్యంలో ఈ రోజు (మే 16) నగరానికి వచ్చింది జట్టు. జట్టులోని ఆటగాడు సిరాజ్ హైమద్ ఇంటిని జట్టు సభ్యులు విజిట్ చేశారు. విరాట్ కోహ్లీ మరియు జట్టులోని ఆటగాళ్లు సందర్శించారు.
దీనికి సంబంధించిన ఫొటోలను ఆర్సీబీ జట్టు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. హైదరాబాద్ లోని సిరాజ్ ఇంటి కొత్త చిత్రాలు (Siraj new home) అంటూ ట్విటర్, ఇన్ స్టాలో పోస్ట్ చేసింది జట్టు. ఆయన ఇంటికి వచ్చిన జట్టుకు సిరాజ్ హైమద్ విందు ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా సిరాజ్ హైమద్ ను జట్టు సభ్యులు అభినందించారు. ఆ తర్వాత హైదరాబాద్ బిర్యాని రుచి చూద్దామంటూ పోస్టులు కూడా దర్శనమిచ్చాయి. ఏ జట్టు అయినా సరే హైదరాబాద్ వేదికగా మ్యాచ్ ఆడితే ఇక్కడి బిర్యాని టేస్ట్ చూడాల్సిందే. హైదరాబాద్ బిర్యాని కోసం ప్రతీ ఆటగాడు ఉవ్విళ్లు ఊరాల్సిందే.
సిరాజ్ హైమద్ ఇంటిని సందర్శించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు తర్వాత మియాన్ ఇంటికి వెళ్లింది. అక్కడ కాసేపు జట్టు సందడిగా గడిపింది. దీనికి సంబంధించిన చిత్రాలను కూడా తమ ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది జట్టు. ఐపీఎల్-2023లో ఇప్పటి వరకూ అత్యధిక వికెట్లు తీశాడనే గుర్తింపు దక్కింది. అయితే సిరాజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ లో 2018 నుంచి కొనసాగుతున్నాడు.